Just In
Don't Miss!
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Sports
ఆ రెండు జట్లు సంజూ శాంసన్ ఇవ్వమన్నాయి.. అందుకే రాజస్థాన్ అలా చేసింది!
- Finance
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి రూ.7 కోట్లు టోకరా వేసిన కేటుగాడిపై ఈడీ కేసు, ఆ సంస్థ ఆస్తులు అటా
- News
గ్రేటర్ మేయర్ నోటిఫికేషన్ రిలీజ్.. 11వ తేదీన సభ్యుల ప్రమాణం, అదేరోజు ఎన్నిక
- Lifestyle
ఈ రాశుల వారు జన్మలో మిమ్మల్ని క్షమించరు.. వారెవరో తెలుసా..?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టాక్ ఆఫ్ ది టౌన్: అల్లు అర్జున్‌కు చిరంజీవి సాయం.. ‘వైకుంఠపురములో’ టీమ్‌కు మెగా హామీ.!
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి జోష్‌తో కనిపిస్తున్నారు. 'ఖైదీ నెంబర్ 150' సూపర్ హిట్ అవడంతో ఆయన ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్య 'సైరా: నరసింహారెడ్డి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు చిరు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే.. బడా డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక, మధ్య మధ్యలో పలు చిత్రాల ఫంక్షన్లకు గెస్టుగా వెళ్లడంతో పాటు చాలా మంది హీరోలకు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు చిరంజీవి ఓ సాయం చేయబోతున్నారు. ఇంతకీ ఏంటా సాయం.? వివరాల్లోకి వెళితే...

హ్యాట్రిక్ చేయడానికి ఇద్దరూ కలిశారు
ప్రస్తుతం అల్లు అర్జున్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అల.. వైకుంఠపురములో' అనే సినిమా చేస్తున్నాడు. ‘జులాయి', ‘సన్నాఫ్ సత్యమూర్తి' వంటి హిట్‌ల తర్వాత వస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. అలాగే, చాలా మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు.

ఆ విషయంలో మాత్రం దూసుకుపోతున్నారు
ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ఎప్పుడో ప్రారంభించేసింది. ఇందులో భాగంగానే కొద్ది రోజులుగా టీజర్‌తో పాటు పాటలను ఒక్కొక్కటిగా వదులుతున్నారు. వీటన్నింటీ ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.

లైవ్‌గా పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు
‘అల.. వైకుంఠపురములో' చిత్ర యూనిట్ ఇటీవల ఓ ప్రకటన చేసింది. జనవరి 6న సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో మ్యూజికల్ కాన్సర్ట్‌ను నిర్వహిస్తున్నట్లు అందులో పేర్కొంది. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు. అలాగే, బన్నీ కూడా డ్యాన్స్ చేయనున్నారని తెలుస్తోంది.

ఒక గుడ్ న్యూస్.. ఒక బ్యాడ్ న్యూస్
అంగరంగ వైభవంగా జరగనున్న మ్యూజికల్ కాన్సర్ట్‌కు చిత్ర యూనిట్ మినహా మరెవరూ అతిథిగా విచ్చేయడం లేదని తెలుస్తోంది. అయితే, ఈ వేడుకకు ఫ్యాన్స్‌ను భారీ సంఖ్యలో ఆహ్వానిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. గెస్ట్ లేకపోవడం లోటేనని కొందరు ఫ్యాన్స్ పెదవి విరుస్తుండగా.. ఈ ఫంక్షన్‌కు వెళ్లొచ్చని మరికొందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అల్లు అర్జున్‌కు చిరంజీవి సాయం
చిత్ర యూనిట్ ప్రకటించినట్లు జనవరి 6న మ్యూజికల్ కాన్సర్ట్‌ను నిర్వహించినా.. రెండు రోజుల తర్వాత ఆంధ్రాలోని ఏదైనా ఓ నగరంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని ప్లాన్ చేశారట. అంతేకాదు, అక్కడకు మెగాస్టార్ చిరంజీవిని కూడా తీసుకు వెళ్తున్నారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఇప్పటికే చిత్ర యూనిట్ ఆయన నుంచి హామీ తీసుకుందని సమాచారం.