వైఎస్ జగన్‌తో చిరంజీవి భేటీ.. కారణం అదే అంటూ మీడియాలో వైరల్

మెగాస్టార్ చిరంజీవి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డిని కలవబోతున్నట్లు టాక్ వస్తోంది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగానే ఉంటున్న చిరంజీవి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఇండస్ట్రీ సమస్యలపై పలువురు నాయకులను కలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పుడు సీఎంను కలవబోతున్నట్లు వార్తలు రాగానే ఒక్కసారిగా అనుమానాలు మొదలయ్యాయి.

మెగాస్టార్ దగ్గరగా వెళుతుండడంతో..

మెగాస్టార్ దగ్గరగా వెళుతుండడంతో..

ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో మెగాస్టార్ సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో అధికార పక్షంపై పోరాడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి వైఎస్ జగన్ కు కాస్త దగ్గరగా వెళుతుండడం పట్ల ఆ విషయం చర్చనీయాంశంగా మారింది. దీంతో అభిమానుల్లో కూడా అనేక రకాల సందేహాలు వెలువడుతున్నాయి.

మెగాస్టార్ ట్వీట్.. సమాధానం ఇచ్చిన జగన్

మెగాస్టార్ ట్వీట్.. సమాధానం ఇచ్చిన జగన్

ఇటీవల వైఎస్.జగన్ ప్రభుత్వం ఓకే రోజులో అత్యదిక టీకాలు వేయించిన క్రమంలో మెగాస్టార్ పాజిటివ్ గా స్పందించారు. ఇక మెగాస్టార్ చేసిన ట్వీట్ పై వైఎస్ జగన్ కూడా స్పందించారు. మీ మంచి మాటలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని ఆ క్రెడిట్ అంతా కూడా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందుతుందని వారి వల్లే ఆ మంచి పని సాధ్యమైనట్లు కూడా వివరణ ఇచ్చారు.

 అనేక అపోహలు

అనేక అపోహలు

ఇక చిరంజీవి, వైఎస్ జగన్ ల మధ్య జరిగిన సంభాషణల నడుమ అనేక అపోహలు మొదలయ్యాయి. అయితే మెగాస్టార్ త్వరలోనే జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా కలవబోతున్నట్లు కథనాలు పుట్టుకొస్తున్నాయి. ఒక విషయంపై కొంతమంది ఇండస్ట్రీ ప్రముఖులతో కలిసి చర్చలు జరిపిస్తారట.

ముఖ్యమంత్రితో భేటి.. ఎందుకంటే?

ముఖ్యమంత్రితో భేటి.. ఎందుకంటే?

ఏపీ ప్రభుత్వం పెద్ద సినిమాలకు సంబంధించిన టికెట్ల రేట్ల విషయంలో ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అలాగే బెన్ఫిట్ షోలకు కూడా అనుమతులు నిరాకరీంచారు. వకీల్ సాబ్ టైమ్ లో టికెట్ల రేట్లు సడన్ గా తగ్గించడంతో నిర్మాతల్లో కంగారు మొదలైంది. ఇక రాబోయే సినిమాల విషయంలో వెసులుబాటు కల్పించేలా అనుమతి కోరాడానికి మెగాస్టార్ సిద్ధమైనట్లు సమాచారం. మరి ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X