»   » సూపర్ స్టార్ తో మెగాస్టార్ రాయబారాలు..చరణ్ కోసమే..!?

సూపర్ స్టార్ తో మెగాస్టార్ రాయబారాలు..చరణ్ కోసమే..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవిలు తిరుగులేని హీరోలు. వయసు మీద పడుతున్నాఈ ఇద్దరూ తమ వారసుల కోసం రంగం మొత్తం సిద్దం చేసి పెట్టేశారు. అల్రెడీ తెలుగులో రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడిగా అనిపించుకుంటుంటే అక్కడ మాత్రం రజనీ అల్లుడు ధనుష్ ఏకంగా నంబర్ వన్ స్థానానికి ఎగబాకుతున్నాడు.

సంక్రాంతికి విడుదలైన తమిళ చిత్రాలలో 'ఆడుకలాం" తో ధనుష్ అందరి హీరోలకన్నా ముందు వరసలో నిలచి మామకు తగ్గ అల్లుడనిపించుకున్నాడు. తెలుగులో 'ఆరెంజ్"తో వెనకు బడ్డ రామ్ చరణ్ సైతం ఈ 'ఆడుకలాం" చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. సంక్రాంతికి జరిగే కోడిపుంజు పోటీల ఆధారంగా పౌరుషాలతో తెరకెక్కిన ఈ చిత్ర కథ తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని తెలియటంతో మెగాస్టార్ తన కుంటుంబంలోని ఓ నిర్మాతని చెన్నై పంపి రజనీకాంత్ తో మాట్లాడి కథను హైదరాబాద్ కు తీసుకు వచ్చే పనిలో పడ్డాడట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu