»   » మీలో ఎవరు కోటీశ్వరుడు... చిరంజీవి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

మీలో ఎవరు కోటీశ్వరుడు... చిరంజీవి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మీలో ఎవరు కోటీశ్వరుడు' నాలుగో సీజన్ కు చిరు హోస్ట్ గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఈ షోకు సంబందించిన ప్రోమో కూడా ఇటీవల రిలీజైంది. చిరంజీవితో షో కావడంతో ఈ కార్యక్రమంపై అంచనాలు మరింత పెరిగాయి.

సినిమా అయినా, టీవీ షో అయినా సెలబ్రిటీ పాపులారిటీ, అతని రేంజిని బట్టి రెమ్యూనరేషన్ ఫిక్స్ చేస్తారు. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమానికి చిరంజీవి రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నారు అనేది హాట్ టాపిక్ అయింది.

చిరంజీవి తొలిసారి బుల్లితెర మీద కనిపిస్తుండటంతో ప్రేక్షకలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత ఎపిసోడ్ల కంటే ఈ షోకు టీఆర్పీ రేటింగ్ భారీగా ఉంటుందని భావిస్తున్నారు.

ఎంత తీసుకుంటున్నారు?

ఎంత తీసుకుంటున్నారు?

ఒక్కో ఎపిసోడ్‌కు పదిలక్షల రూపాయలు చిరంజీవికి రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. చిరంజీవికి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇంత భారీ రెమ్యూరేషన్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. సౌత్ లో ఇప్పటి వరకు టీవీ షోలు సంబంధించి ఇదే హయ్యెస్ట్ అమౌంట్.

చిరంజీవి డిమాండ్ చేయలేదు

చిరంజీవి డిమాండ్ చేయలేదు

చిరంజీవి తనకు ఇంత రెమ్యూనరేషన్ కావాలని అసలు డిమాండ్ చేయలేదట. చాలా కాలం తర్వాత ఆయన మళ్లీ 150వ సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని డిసైడ్ అయ్యారు. అందుకే రెమ్యూనరేషన్ గురించి పట్టించుకోకుండా మీలో ఎవరు కోటీశ్వరుడు షో హోస్ట్ చేసేందుకు అంగీకరించారు.

తక్కువే...

తక్కువే...

వాస్తవానికి చిరంజీవి రేంజి, ఆయనకున్న స్టార్ ఇమేజ్ తో పోల్చితే ఒక్కో ఎపిసోడ్ రూ. 10 లక్షలు పెద్ద మొత్తం ఏమీ కాదని అంటున్నారు అభిమానులు.

రిజిస్ట్రేషన్లు షురూ

రిజిస్ట్రేషన్లు షురూ

కాగా... మీలో ఎవరు కోటీశ్వరు 4వ సీజన్లో అవకాశం దక్కించుకోవాలనుకుంటే ముందుగా రిజిస్ట్రేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా చిరంజీవి అడిగే ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. మీరు సరైన సమాధానం చెబితే....ఈ కార్యక్రమం ఎంపిక ప్రక్రియలో మీరు ఒక మెట్టు ఎక్కినట్లు అవుతుంది. దసరా సందర్భంగా ఆల్రెడీ మొదటి ప్రశ్నను రిలీజ్ చేసారు. తెలుగు రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యలో ఔత్సాహికులు రిజిస్టర్ చేసుకున్నారు.

English summary
Mega Star Chiranjeevi is hosting the Mega TV show Meelo Evaru Koteeswarudu. However, we came to know that the actor is taking shocking remuneration for being the host - literally 10 lakhs per episode.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu