For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  షాకింగ్: లూసిఫర్‌పై పట్టు వీడని చిరంజీవి .. రూటు మార్చిన సుజిత్ రెడ్డి

  By Manoj
  |

  దాదాపు నలభై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ముద్రను వేసుకుని... స్టార్ హీరోగా కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. స్వయంకృషితో సినిమాల్లోకి ప్రవేశించిన ఆయన... తక్కువ వ్యవధిలోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే బడా హీరోల నుంచి పోటీ తట్టుకుని నిలబడగలిగారు. ఈ కారణంగానే ఆయన ఇప్పటికీ టాప్ ప్లేస్‌ కోసం పోటీ పడుతూనే ఉన్నారు. ఇక, రీఎంట్రీలో దూకుడును ప్రదర్శిస్తున్న చిరంజీవి.. తన కొత్త సినిమాను ఆపేశారని తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఇంతకీ ఏమైంది.? పూర్తి వివరాల్లోకి వెళితే.....

  ఆశలు రేపిన వెంటనే నిరాశ పరిచింది

  ఆశలు రేపిన వెంటనే నిరాశ పరిచింది

  రాజకీయాల కోసం సినిమాలకు దూరమయ్యారు మెగాస్టార్ చిరంజీవి. సుదీర్ఘ విరామం తర్వాత ఆయన ‘ఖైదీ నెంబర్ 150'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఎన్నో అనుమానాల నడుమ విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు పలు రికార్డులు బ్రేక్ చేసింది. అయితే, ఆ తర్వాత వచ్చిన ‘సైరా: నరసింహారెడ్డి' మాత్రం పరాజయం పాలవడం నిరాశను మిగిల్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘సైరా' బాక్సాఫీస్ ముందు బోల్తా పడడంతో... ఈ సారి చేసే సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాలని చిరంజీవి పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే బడా డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాను మ్యాట్నీ మూవీస్‌తో కలిసి రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.

  తండ్రీ కొడుకుల కలయికలో మూవీ

  తండ్రీ కొడుకుల కలయికలో మూవీ

  సందేశాత్మక చిత్రాల దర్శకుడు కొరటాల తెరకెక్కిస్తోన్న చిరంజీవి చిత్రానికి ‘ఆచార్య' అనే టైటిల్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో మెగాస్టార్‌తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. దేవాదాయ భూముల ఆక్రమణలపై పోరాటం చేసే నక్సలైట్‌గా చరణ్.. అతడి ఆశయాలను నెరవేర్చే వ్యక్తిగా చిరు నటిస్తున్నారు. ఇందులో కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

  స్పీడు పెంచిన చిరు.. ఏకంగా మూడు

  స్పీడు పెంచిన చిరు.. ఏకంగా మూడు

  రీఎంట్రీలో చిరంజీవి దూకుడును ప్రదర్శిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఈ మధ్య ఏకంగా ముగ్గురు దర్శకులతో సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో ఒకరు... ‘సాహో' దర్శకుడు సుజిత్ కాగా, బాబీ, మెహర్ రమేశ్ మిగిలిన ఇద్దరు. ఈ విషయాన్ని చిరంజీవే స్వయంగా ప్రకటించారు. ‘ఆచార్య' తర్వాత ఈ సినిమాలు ఉంటాయని కూడా ఆయన వెల్లడించారు.

  ఆ సినిమా రీమేక్‌ కోసం మెగా ప్లాన్

  ఆ సినిమా రీమేక్‌ కోసం మెగా ప్లాన్

  కేవలం రెండు సినిమాల అనుభవమే ఉన్న సుజిత్‌కు చిరంజీవి అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. వీళ్ల కాంబోలో రాబోయే చిత్రం మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసీఫర్'కు రీమేక్. మోహన్‌లాల్ హీరోగా నటించిన ఈ సినిమాను పృథ్వీ రాజ్ తెరకెక్కించాడు. భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్నే తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు చిరంజీవి తెలిపారు.

   చిరంజీవి కొత్త సినిమా ఆగిపోయినట్లే

  చిరంజీవి కొత్త సినిమా ఆగిపోయినట్లే

  ‘లూసీఫర్' రీమేక్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడక ముందే.. ఇందులో పలానా హీరో నటిస్తున్నాడు... పలానా హీరోయిన్ కీలక పాత్ర పోషిస్తుంది అని ఎన్నో రకాలు రూమర్లు ప్రచారం అయ్యాయి. అంతేకాదు, ఇది మల్టీస్టారర్ మూవీగా రాబోతుందని కూడా అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా ప్రకటనకే పరిమితమైనట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

  ఆ డైరెక్టర్ అందుకే రూటు మార్చాడా.?

  ఆ డైరెక్టర్ అందుకే రూటు మార్చాడా.?

  ‘లూసీఫర్' తెలుగులోనూ విడుదల కావడం... సుజిత్‌ మార్చి రాసిన స్క్రిప్ట్ పట్ల చిరంజీవి పట్టు వీడని కారణాలతో ఈ సినిమా వెనక్కు నెట్టి.. మరో సినిమాను ముందుకు తెచ్చినట్టు ఓ న్యూస్ ఫిలింనగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కదని తెలిసిన తర్వాతనే సుజిత్ మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కూడా ప్రచారం జరుగుతోంది.

  English summary
  Chiranjeevi recently confirmed via an interview that Saaho director Sujeeth has been signed for the project. He said Sujeeth is currently working on the script and making necessary changes to suit Telugu sensibilities.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X