»   » నాగ చైతన్య 'దోచేయ్‌' లో చిరు సూపర్ హిట్ సాంగ్

నాగ చైతన్య 'దోచేయ్‌' లో చిరు సూపర్ హిట్ సాంగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాగచైతన్య హీరో గా నటించిన చిత్రం 'దోచేయ్‌'. కృతి సనన్‌ హీరోయిన్. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాత. ఏప్రిల్‌ 24న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రంలో చిరంజీవి ..సంఘర్షణ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ ‘కట్టు జారి పోతావుందే...' పాటని రీమిక్స్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇది సీక్రెట్ గా ఉంచారని చెప్పుకుంటున్నారు. అయితే చిత్రంలో ఇది ఓ బిట్ గానే వస్తుందంటున్నారు. ఇది ఎంతవరకూ నిజమో తెలియాలంటే సినిమా రిలీజ్ దాకా ఆగాల్సిందే.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


మరో ర్రక్క ఈ చిత్రంలో నాగచైతన్య ద్విపాత్రాభినయం చేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అలా ఊహించటానికి కారణాలు సైతం చెప్తున్నారు. ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడేదాన్ని బట్టి... ‘దోచేయ్' టైటిల్‌లో ‘దో', ‘చేయ్' కలిపే రాసినా రెండింటికీ మధ్య తేడా వచ్చేలా అక్షరాల్లో రంగుల మార్పు తో ఇది గమనించవచ్చు అంటున్నారు. ‘చేయ్', ‘చైతూ' ఇవి రెండూ నాగచైతన్యను ముద్దుగా పిలిచే పేర్లు. అలాగే ‘దో' అంటే రెండని అర్థం. ఆ విధంగా సినిమాలో నాగచైతన్య ద్వి పాత్రాభినయం చేస్తున్నాడని చెప్పకనే చెబుతున్నారని అంటున్నారు.


Chiranjeevi’s song in Naga Chaitanya’s movie Dochey?

దానికి తోడు ఈ సినిమా ట్రైలర్‌లో చెప్పినట్టు ‘ప్రతీ మోసం వెనుక ఇద్దరుంటారు. మోసం చేసేవాడు, మోసపోయేవాడు' అన్న వాక్యం ప్రకారం ఆ రెండు పాత్రలనూ నాగచైతన్యే చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. అయితే ఇవన్నీ ఊహాగానాలేనా లేక నిజమా అనేది తెలియాలంటే ఏప్రియల్ 24 దాకా ఆగాల్సిందే.


నిర్మాత మాట్లాడుతూ ''మనం దోపిడీకి గురి కాకూడదంటే ఎదుటివాడిని దోచేయడమే మార్గం అని నమ్మిన ఓ యువకుడి కథ ఇది. నాగచైతన్య అభినయం అందరినీ అలరిస్తుంది. రోజుకొకటి చొప్పున విడుదల చేస్తున్న పాటలకీ, ప్రచార చిత్రాలకీ మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా అందరి అంచనాలను అందుకొనేలా ఉంటుంది'' అన్నారు.


అలాగే... నాగచైతన్య హీరోగా స్వామిరారా టీమ్ తో మా బ్యానర్ లో నిర్మిస్తున్న దోచెయ్ చిత్రాన్ని ఏప్రియల్ 24న సమ్మర్ స్పెషల్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నాం. అలాగే ఏప్రియల్ రెండో వారంలో లహరి మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం ఆడియోను గ్రాండ్ గా విడుదల చేస్తున్నాం. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్ కు, టీజర్స్ కు ఎక్స్ ట్రార్డనరీ రెస్పాన్స్ వస్తోంది. అభిమానుల ఎక్సపెక్టేషన్స్ రీచ్ అయ్యేలా, మా బ్యానర్ ప్రతిష్టను మరింత పెంచేలా సుధీర్ వర్మ అద్బుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నాగ చైతన్య కెరీర్ లోమరో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది అన్నారు.


Chiranjeevi’s song in Naga Chaitanya’s movie Dochey?

ఈ చిత్రంలో చైతన్య ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రలో కనిపిస్తాడట. మోసం చేసేవారిని ఘరానా మోసంతో దెబ్బకొట్టే యువకుడి పాత్రలో నాగచైతన్య నటిస్తున్నాడు. అందుకే దీనికి ‘దోచెయ్‌' అనే టైటిల్‌ను పెట్టినట్లు సమాచారం.


''ప్రతి మోసం వెనుక ఇద్దరుంటారు. ఒకరు మోసం చేసేవాడు. మోసపోయేవాడు. నువ్వు రెండో వాడు కాకుండా ఉండాలంటే, మొదటివాడివి అయ్యితీరాల్సిందే..'' ఈ అంశం చుట్టూ తిరిగే కథే మా చిత్రం అంటున్నారు సుధీర్‌ వర్మ.


ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణముర ళి, రవిబాబు, రావు రమేష్‌ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్‌., సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌., ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌., ఆర్ట్‌: నారాయణరెడ్డి., కో-ప్రొడ్యూసర్‌: భోగవల్లి బాపినీడు., నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌., కథ-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: సుధీర్‌వర్మ.

English summary
Nagachaithanya coming along with Kriti Sanon to ‘Dochay’ the hearts of Akkineni fans and movie lovers on 24th April with the music of Sunny. If the ongoing buzz in the tinsel town is to be believed, this movie features a song which reminds Chiranjeevi’s song ‘Kattu Jaripothuuvundi’ from Sangarshana.
Please Wait while comments are loading...