»   » పవన్ కళ్యాణ్ లా రామ్ చరణ్ చేయడం ‘చిరు’కి ఇష్టం లేదు..

పవన్ కళ్యాణ్ లా రామ్ చరణ్ చేయడం ‘చిరు’కి ఇష్టం లేదు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

'మగధీర" చిత్రానికి రెండేళ్లకు పైగా సమయం తీసుకున్న చరణ్ ఆ సినిమా విడుదలై సంవత్సరం దాటినా తదుపరి చిత్రం రిలీజ్ చేసుకోలేకపోయాడ. 'మగధీర" విడుదలకి ముందే భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేయాలని చరణ్ ఖరారు చేసుకున్నాడు. అయితే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి చాలా సమయం పట్టింది. తీరా సెట్స్ మీదకు వెళ్ళాక అయినా 'ఆరెంజ్" షూటింగ్ స్పీడుగా జరగలేదు. డైరెక్టర్ భాస్కర్ తాపీగా వర్క చేస్తూ ఉండడంతో మధ్యలో చరణ్ 'మెరుపు" చిత్రం మొదలు పెట్టాడు. రెండు సినిమాలనీ ఒకేసారి షూటింగ్ చేయాలనుకున్న చరణ్ ప్లాన్ బెడిసికొట్టింది. అటు 'మెరుపు" ముందుకు కదలక, ఇటు 'ఆరెంజ్" పని సజావుగా సాగక రెండిట్లో ఏదీ రెడీ కాలేదు.

2007లో 'చిరుత" చిత్రంతో హీరోగా పరిచయమైన రామ్‌ చరణ్‌ ఇంతవరకు కేవలం రెండే సినిమాల్లో నటించడం పట్ల చిరంజీవి హ్యాపీగా లేరని తెలుస్తోంది. కనీసం ఏడాదికి ఒక్క సినిమా అయినా రావాలని చిరంజీవి కోరుకుంటున్నారు. పవన్‌కళ్యాణ్‌ మాదిరిగా రామ్‌చరణ్‌ కూడా లేటుగా సినిమాలు చేయడం చిరంజీవి ఇష్టపడడం లేదు. చరణ్‌ కూడా వెంటవెంటనే సినిమాలు చేయాలని అనుకుంటున్నా దర్శకుల జాప్యం వల్ల అలస్యం జరిగిపోతూనే ఉంది. హోమ్‌ బ్యానర్‌లలోనే సినిమాలు చేస్తున్నా సరైన ప్లానింగ్‌ లేకపోవడం పట్ల చిరంజీవి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu