»   » అల్లు అర్జున్ చిత్రంలో మెగాస్టార్.. ఎన్టీఆర్‌కు షాక్..

అల్లు అర్జున్ చిత్రంలో మెగాస్టార్.. ఎన్టీఆర్‌కు షాక్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకటి తర్వాత మరో సినిమాలో నటించడంలో అల్లు అర్జున్ జోరు పెంచారు. దువ్వాడ జగన్నాధం చిత్రం తర్వాత నిర్మాత లగడపాటి శ్రీధర్ నిర్మాణ సారధ్యంలో భారీ ప్రాజెక్ట్ రూపొందనున్నది. ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మించేందుకు నిర్మాత శ్రీధర్ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక పాత్రను పోషించే అవకాశం ఉంది. నాగబాబు సహనిర్మాతగా వ్యవహరిస్తున్నట్టు తెలిసింది.

దేశభక్తి కథతో ముందుకు..

దేశభక్తి కథతో ముందుకు..

అల్లు అర్జున్ నటించే ఈ చిత్రానికి రేసుగుర్రం సినిమా కథా రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం వహించనున్నారు. ఈ కథను జూనియర్ ఎన్టీఆర్‌కు చెప్పగా ఆయన ఆసక్తి చూపకపోవడంతో అదే కథను అల్లు అర్జున్‌కు చెప్పారట. వంశీ చెప్పిన దేశభక్తి నేపథ్యం ఉన్న కథ నచ్చడంతో అల్లు అర్జున్ ఒకే చెప్పినట్టు సమాచారం. ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన చిత్రాన్ని అల్లు అర్జున్ ఒకే చెప్పడం సినీ వర్గాలను షాక్ గురిచేస్తున్నది.

నా పేరు సూర్య..

నా పేరు సూర్య..

వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందే చిత్రానికి ‘నా పేరు సూర్య' నా ఇల్లు ఇండియా అనే ట్యాగ్‌లైన్ అని పెట్టినట్టు తెలిసింది. ఇప్పటికే ఈ టైటిల్‌ను లార్స్‌కో బ్యానర్‌పై రిజిస్టర్ చేసినట్టు సమాచారం.

సూర్యపై మెగా బ్రదర్స్ మోజు

సూర్యపై మెగా బ్రదర్స్ మోజు

ఈ చిత్రంలో మెగా బ్రదర్ నాగబాబు కొంత మొత్తం పెట్టుబడి పెడుతున్నట్టు సినీ వర్గాల వెల్లడించాయి. ఈ చిత్రంలో ఓ ప్రత్యేకమైన పాత్రను పోషించాలని చిరంజీవిని అల్లు అర్జున్ రిక్వెస్ట్ చేసినట్టు తెలిసింది. అయితే అందుకు మెగాస్టార్ సానుకూలంగానే స్పందించినట్టు సమాచారం.

తమిళంలో ఎంట్రీకి బ్రేక్

తమిళంలో ఎంట్రీకి బ్రేక్

తమిళ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్‌లో అల్లు అర్జున్ నటించే చిత్రానికి బ్రేక్ పడింది. నిర్మాత జ్క్షాన్‌వేల్ రాజా, లింగుస్వామి మధ్య ఆర్థికపరమైన విభేదాలు తలెత్తడంతో ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయినట్టు తెలుస్తున్నది. దీంతో అల్లు అర్జున్ కోలివుడ్‌లో ప్రవేశించాలన్న కోరికకు మరోసారి అడ్డంకి ఏర్పడింది.

English summary
Allu Arjun next movie is Naa Peru Surya after Duvvada Jagannadham. Producer Lagadapati Sridhar is returning to movie production with Allu Arjun's next movie. There is also talk that Allu Arjun is requesting Megastar Chiranjeevi to do a small role in the movie for a key scene.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu