»   » వర్మ నీచేత ఎటువంటి పాడుపనులు చేయించలేదు హామ్మయ్య

వర్మ నీచేత ఎటువంటి పాడుపనులు చేయించలేదు హామ్మయ్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ ఈపేరు ఇండియాలో అందిరికి సుపరిచితం. వైవిద్యమైనటువంటి చిత్రాలను తీయడంలో అతనికి అతనే సాటి.. ముఖ్యంగా సినిమాలలో ఆడవారి అందాలను కెమెరా ముందు చూపించడంలో ఆయనకి ఆయనే సాటి.. అలాంటి రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి సినిమా కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం..అప్పలరాజు..ప్రస్తుతం విడుదలకు సిద్దమవుతున్న ఈసినిమా గురించి రామ్ గోపాల్ వర్మ కొన్ని ఆసక్తికరమైన విశేషాలు వెల్లడించడం జరిగింది.

గతంలో రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి సినిమాలు గనుక మనము చూసినట్లైతే హీరోయిన్‌గా నటించినటువంటి వాళ్శు అందాలను చాలా ఎక్కువగా ఎక్స్ పోజ్ చేసిన వాళ్లే. ఐతే విడుదలకు సిద్దంగా ఉన్నటువంటి కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం..అప్పలరాజు విషయంలో మాత్రం అలా జరగలేదని అంటున్నారు రాము. దానికి కారణం ఈసినిమాలో హీరోయిన్‌గా నటించినటువంటి స్వాతికి, హీరో సునీల్‌కి మద్య రోమాన్స్ చేయించడానికి స్కిప్టు అలాంటిది కాదని అన్నారు.

దీనిపై స్వాతి స్నేహితులు మాత్రం స్వాతిని ఆకాశానికి ఎత్తి వేస్తున్నారంట. దానికి కారణం రామ్ గోపాల్ వర్మ సినిమాలో నటించిన నువ్వు ఎలాంటి ఎక్స్ పోజింగ్, రోమాన్స్ లేకుండా బయటకు రావడమే మాటలు కాదు అని అంటున్నారు. అసలు నువ్వు ఆయన చేతుల్లో నుండి ఇంత సేఫ్ గా బయటకు వస్తావని మేము ఎవరం కూడా ఊహించేలేదని అన్నారని సమాచారం. ఏది ఏమైనాగాని సినిమా విడుదలైతే గాని ఏవిషయం చెప్పలేమని అంటున్నారు సినీ పండితులు.

English summary
Generally, a heroine in Ramu's film is required to show a maximum oomph to enthrall the audience. However, according to the script, there is no romance between the movie's lead man Sunil and Colors Swathi. As a result, Ramu has not forced Colors Swathi to do any such acts in the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu