»   » ‘రంగస్థలం’లో ఆతడి సీన్లు లేపేశారా? నిజం ఎంత?

‘రంగస్థలం’లో ఆతడి సీన్లు లేపేశారా? నిజం ఎంత?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఓ వైపు 'రంగస్థలం' మూవీ బ్లాక్ బస్టర్ టాక్‌తో బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తూ దూసుకెళుతుంటే.... మరో వైపు ఈ సినిమా గురించి ఓ వార్త చర్చనీయాంశం అయింది. రంగస్థలంలో ప్రముఖ తెలుగు కమెడియన్ పృథ్వి కూడా నటించారని, అయితే సినిమా నిడివి ఎక్కువ కావడంతో ఎడిటింగులో అతడి సీన్లు లేపేశారని టాక్.

రంగస్థలం సినిమా మొత్తం నిడివి 2 గంటల 50 నిమిషాలు ఉంది. సినిమా విడుదల ముందే దర్శకుడు సుకుమార్ రన్ టైమ్ ఎక్కువగా ఉందని, కట్ చేయాలనే ఆలోచన చేశారట. మెగాస్టార్ చిరంజీవికి స్పెషల్ షో వేసిన తర్వాత సినిమాను కొంతమేర ట్రిమ్ చేస్తాననే విషయం మెగాస్టార్ ధృష్టికి తీసుకెళ్లారట.

Comedian Prudhvi scenes scissored from Rangasthalam?

అయితే సినిమాను ట్రిమ్ చేయాలసిన అవసరం లేదని, ఎక్కడా బోర్ అనిపించలేదని, సింగిల్ సీన్ కూడా తీసేయాల్సిన అవసరం లేదని చిరంజీవి చెప్పినట్లు సమాచారం. అయితే మెగాస్టార్‌కు చూపించడానికి ముందే సుకుమార్ పృధ్వి సీన్లను లేపేసినట్లు చర్చించుకుంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.

రంగస్థలం గ్రామంలో జరిగే డ్రామాతో సంబంధం లేకుండా సెకండాఫ్‌లో పృధ్వి,చరణ్ మధ్య చిన్న కామెడీ ట్రాక్ సుకుమార్ ప్లాన్ చేశారు. అయితే సినిమా మొత్తం పూర్తయిన తర్వాత లెంత్ ఎక్కువ కావడంతో పృధ్వి ట్రాక్ మొత్తాన్ని తీసేయక తప్పలేదని అంటున్నారు.

English summary
Comedian Prudhvi scenes were scissored from the 'Rangasthalam' movie as per the buzz. Though Prudhvi comedy was planned very well by Sukumar in some scenes, he scissored those scenes because didn't find better option to decrease the runtime. So, 10 minutes of Prudhvi scenes were removed in the editing as per the information.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X