For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇన్‌సైడ్ టాక్ ఏంటి?: తల పట్టుకున్నారట?, హలో వర్సెస్ ఎంసీఏ.. ఏం జరుగుతోంది..

  |

  రెండు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలకు సిద్దమవుతున్నాయంటే.. బాక్స్ ఆఫీస్ వద్ద దేని సత్తా ఎంత అనే చర్చ జరగడం మామూలే. హీరోని బట్టి సినిమా చూడాలా?.. లేక దాన్ని తీసిన దర్శకుడు, నిర్మాణం వంటి విషయాలను ప్రియారిటీగా చూడాలా? అన్నది ప్రేక్షకుడే నిర్ణయించుకుంటాడు.

  MCA : నానిని లైట్ తీసుకున్న సాయి పల్లవి కానీ ఇరగదీసింది !

  ఇదే డైలామా మార్కెటింగ్ కు సంబంధించి అటు డిస్ట్రిబ్యూటర్లను, ఎగ్జిబిటర్లనూ వెంటాడుతుంది. కాబట్టి తమకు నమ్మకంగా అనిపించే సినీ పెద్దలను లేదా సినిమాలపై మంచి అవగాహన ఉన్నవాళ్లను ఆరా తీసి.. ఏదైతే బెటర్ అనేది వారు నిర్ణయించుకుంటారు.

  ఇప్పుడిదంతా ఎందుకంటే.. ఓ పక్క అక్కినేని అఖిల్ 'హలో'.. మరో పక్క నాని 'ఎంసీఏ' రెండూ ఒకరోజు వ్యవధిలో విడుదలకు సిద్దమవడంతో.. కొంతమంది ఎగ్జిబిటర్లు ఏ సినిమా అయితే బెటర్ అని ఆరా తీస్తున్నారట.

   ఎంసీఏ వర్సెస్ హలో:

  ఎంసీఏ వర్సెస్ హలో:

  మొదటి సినిమా ఫ్లాప్ తర్వాత అఖిల్ చేస్తున్న రెండో సినిమా కావడం.. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వస్తుండటంతో.. సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. యాక్షన్ సీక్వెన్స్ గురించి చేస్తున్న ప్రచారం కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది. ఒక రకంగా బజ్ రీత్యా.. హలోకి మంచి క్రేజే ఉంది. అయితే ఎంసీఏతో ఈ సినిమాకు గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది.

   డైలామాతో తలపట్టుకున్న ఎగ్జిబిటర్స్:

  డైలామాతో తలపట్టుకున్న ఎగ్జిబిటర్స్:

  బజ్ రీత్యా హలో ముందంజలో ఉన్నప్పటికీ.. దిల్ రాజ్ నిర్మించిన సినిమా కావడంతో చాలామంది ఎగ్జిబిటర్లకు ఎంసీఏ పైనే గురి ఉంది. దానికి తోడు నాని, సాయిపల్లవిల సహజ నటన ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పిస్తుందనే అంచనా ఉంది.

  అన్నింటికి మించి దిల్ రాజు చేతిలో ఉన్న థియేటర్స్ ఈ సినిమాకు ప్రధాన బలం. కానీ దిల్ రాజుకు థియేటర్లు లేని కొన్నిచోట్ల మాత్రం.. ఎగ్జిబిటర్లు హలో/ఎంసీఏల్లో ఏది తీసుకుంటే బెటర్ అనే డైలామాలో పడ్డారట.

   ఎంసీఏ తీసుకోమని సలహా?:

  ఎంసీఏ తీసుకోమని సలహా?:

  ఇదే డైలామాతో ఓ ఎగ్జిబిటర్ సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ పెద్ద తలకాయను సంప్రదించారట. ప్రముఖ నిర్మాత, బయ్యర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ అయిన అతను.. మరో మాట లేకుండా 'ఎంసీఏ'కు తిరుగులేదు అని తేల్చేశారట.

  ఎందుకు ఎంసీఏ అన్నది ఇప్పుడే చెప్పలేను కానీ రిలీజ్ అయ్యాక మీకే తెలుస్తుంది అన్నారట. అయితే ఓపెనింగ్స్ రీత్యా హలో సినిమాకు ఎక్కువ క్రేజ్ ఉంటుందని ఎగ్జిబిటర్లు భావిస్తున్నారట. దీంతో ఈ రెండు సినిమాలు వారిని ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడేశాయట.

  సెన్సార్ రిపోర్ట్!:

  సెన్సార్ రిపోర్ట్!:

  ఎంసీఏ సినిమా ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుని మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. యు/ఏ సర్టిఫికెట్ తెచ్చుకున్నప్పటికీ.. ప్రచార చిత్రాలన్ని ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. యూత్‌తో పాటు, ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ చిత్రాన్ని ఆదరించే అవకాశముంది.

  మరోవైపు అఖిల్ హలో సినిమాకు ఇంకా సెన్సార్ పూర్తి కాలేదు. సెన్సార్ టాక్ ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తి నెలకొంది. విక్రమ్ కె కుమార్ బ్యూటీఫుల్ ప్రజేంటేషన్ మరోసారి మ్యాజిక్ చేస్తే అఖిల్‌కు హిట్టు ఖాయం. యూత్‌ను ఎట్రాక్ట్ చేసేలా ఉన్న యాక్షన్ సీక్వెన్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.

  ఇలా రెండు సినిమాలపై ఎవరి అంచనాలు వారికి ఉండటంతో.. బాక్స్ ఆఫీస్ వద్ద దేని సత్తా ఎంతనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

  English summary
  Both the films are quite prestigious in their own rights and will also see a good opening. but we need to see which film comes on the top in this tough fight.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X