»   » ప్రభాస్ పెళ్లి ఖరారు: బాహుబలి-2 రిలీజ్ ముందే, ఎక్కడమ్మాయి అంటే?

ప్రభాస్ పెళ్లి ఖరారు: బాహుబలి-2 రిలీజ్ ముందే, ఎక్కడమ్మాయి అంటే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి కొంత కాలంగా హాట్ టాపిక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. 36 ఏళ్ల ఈ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఓ ఇంటివాడు ఎప్పుడవుతాడో అంటూ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ప్రభాస్ తన జీవితంలోనే అత్యంత సీరియస్‌గా తీసుకున్న అంశం ఏదైనా ఉంది అంటే... అది బాహుబలి ప్రాజెక్టే. ఇతర సినిమాలేవీ చేయకుండా కేవలం ఈ ప్రాజెక్టు కోసం ప్రభాస్ దాదాపు ఐదేళ్లు కేటాయించాడు. వయసు మీద పడుతున్నా ఈ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు పెళ్లి కూడా చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడంటే ఈ ప్రాజెక్టను ప్రభాస్ ఎంత సీరియస్ గా తీసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ప్రభాస్ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభించింది.

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ దశ తిరిగింది. తన స్టార్ ఇమేజ్ టాలీవుడ్ సర్కిల్ దాటి, బాలీవుడ్ బోర్డర్‌ను క్రాస్ చేసి మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రపంచ ప్రముఖుల సరసన తన మైనపు విగ్రహం ప్రతిష్టించే వరకు వెళ్లింది.

పెళ్లికి సిద్ధం

పెళ్లికి సిద్ధం

జీవితంలో ఏదో సాధించాలని, పెళ్లి ముందుకు చెప్పుకోవడానికి ఓ గొప్ప అధ్యాయం ఉండాలని ఎదురు చూసిన ప్రభాస్.... తాను అనుకున్నది సాధించిన తర్వాత పెళ్లికి రెడీ అయ్యారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘బాహుబలి-2' షూటింగ్ చివరి దశలో ఉంది. ఇది పూర్తయిన వెంటనే ప్రభాస్ పెళ్లికి సంబంధించిన వ్యవహారాల్లో బిజీకాబోతున్నాడు.

వచ్చే వేసవిలో వివాహం

వచ్చే వేసవిలో వివాహం

వచ్చే వేసవిలో వివాహం చేసుకునేందుకు ప్రభాస్ సిద్ధమవుతున్నాడు. దాదాపుగా బాహుబలి-2 సినిమా కంటే ముందే ప్రభాస్ వివాహం జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

అమ్మాయి ఎవరు?

అమ్మాయి ఎవరు?

కొంతకాలంగా ప్రభాస్ కు తగిన అమ్మాయిని వెతికే పనిలో ఉన్న కృష్ణం రాజు అండ్ ఫ్యామిలీ చివరకు విశాఖపట్నంలో ప్రభాస్ హైటు, వెయిటు, అందానికి సరిజోడి అయిన అమ్మాయిని ఎంపిక చేసారట. ఆమె ప్రముఖ పారిశ్రామికవేత్త కుమర్తె అని తెలుస్తోంది.

మేడమ్ టుస్సాడ్స్

మేడమ్ టుస్సాడ్స్

మేడమ్ టుస్సాడ్స్: ప్రభాస్ మైనపు విగ్రహం ఖర్చెంత? ఎవరు భరిస్తారు? ..... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
'Baahubali' Actor Prabhas To Get Married In 2016 summer.
Please Wait while comments are loading...