For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Pushpa Daakko Daakko Meka కాపీనా.. మ్యూజిక్ అక్కడి నుంచి, స్టెప్స్ ఎక్కడి నుంచి అంటే?

  |

  అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ కెరీర్ లో మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా మీద మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులలో కూడా విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ప్రత్యేకంగా ఉండేలాగా చూస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే తాజాగా ఈ రోజు ఈ సినిమా నుంచి దాక్కో దాక్కో మేక అనే ఒక సాంగ్ విడుదల చేయగా ఆ సినిమా మీద కాపీ మరకలు పడ్డాయి. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

  దాక్కో దాక్కో మేక

  దాక్కో దాక్కో మేక

  ఆర్య, ఆర్య 2 లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఈ సినిమాని అల్లు అర్జున్ కెరీర్ లోనే మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా లెవెల్ లో రెండు భాగాలుగా మైత్రి మూవీ మేకర్స్ లాంటి బడా నిర్మాణ సంస్థ ముత్తంశెట్టి ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి నిర్మిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ తన కెరీర్ లోనే మొట్టమొదటిసారిగా ఒక ఊర మాస్ లుక్ లో అది కూడా ఒక లారీ డ్రైవర్ పాత్ర అయిన పుష్ప రాజ్ పాత్ర పోషిస్తున్నాడు. దీంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్ అంటూ ఒక వీడియో విడుదల చేయగా ఆ వీడియో అనేక రికార్డులు బద్దలు కొట్టింది. ఈరోజు ఒకేసారి ఏకంగా ఐదు బాషలలో దాక్కో దాక్కో మేక అనే పాట విడుదల చేయగా దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

  సూపర్ రెస్పాన్స్

  సూపర్ రెస్పాన్స్

  ఆకలి ఆకలి అంటూ మొదలవుతున్న ఈ పాటలోని సాహిత్యం అయితే ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ సాంగ్ లో తనదైన ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్న అల్లు అర్జున్ మాస్ స్టెప్పులతో అదిరిపోయే ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాడు. ఇక బన్నీ వెనకాల లేడీ డాన్సర్స్ కూడా తమదైన శైలిలో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక ఈ పాటకు దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన సంగీతం కూడా అదిరిపోయింది అంటూ పెద్ద ఎత్తున ప్రశంసలు లభిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ పాట యూట్యూబ్ మొత్తం మీద మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటూ ఫస్ట్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. ఈ పాటని తెలుగులో శివం పాడగా చంద్ర బోస్ గారు రాశారు. ఈ పాటని హిందీలో విశాల్ దద్లానీ, తమిళ్ లో బెన్నీ దయాల్, మలయాళంలో రాహుల్ నంబియార్, కన్నడలో విజయ్ ప్రకాష్ పాడారు.

  స్టెప్స్ ఎక్కడివి అంటే

  స్టెప్స్ ఎక్కడివి అంటే

  అయితే ఈ పాటకు అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గతంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన గబ్బర్ సింగ్ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ లాగానే ఉందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అలాగే బన్నీ డాన్స్ విషయానికి వస్తే ఈ పాటను ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య రూపొందించారు. అయితే ఈ పాటలో ఉన్న హుక్ స్టెప్ అయితే మాస్టర్ సినిమాలో పాపులర్ అయిన వాతి కమింగ్ స్టెప్ లాగా ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరయితే ఇదే స్టెప్ ధనుష్ హీరోగా ఈ మధ్య కాలంలో విడుదలైన జగమే తంత్రం సినిమాలో రకిట రకిట పాట స్టెప్స్ కూడా ఇలాగే ఉంటాయని కామెంట్లు పెడుతున్నారు.. అల్లు అర్జున్ మేకోవర్ విషయంలో మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే ఈ కాపీ మరకల వ్యవహారం మాత్రం యూనిట్ కి ఇప్పుడు తలనొప్పిగా మారింది అని చెప్పక తప్పని పరిస్థితి.

  గతంలో కూడా కాపీ మరకలు


  నిజానికి గతంలో కూడా ఈ సినిమాకి సంబంధించిన కాపీ మరకలు పడ్డాయి. ఎప్పుడైతే సినిమా కోసం ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్ అంటూ ఒక టీజర్ విడుదల చేశారో అప్పుడే ఆ టీజర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కాపీ అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.. అవెంజర్స్ అనే ఒక హాలీవుడ్ సినిమాకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని ఈ టీజర్ కోసం వాడారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అలాగే హిందీలో అక్షయ్ కుమార్ నటించిన బేబీ సినిమాలోని ఒక సీన్ లో కూడా ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుందని దానిని తస్కరించి ఇక్కడ పెట్టారని కూడా ఆ మధ్య ఆరోపణలు వచ్చాయి.

  Farhan Akthar,Mrunal Thakur Makes Fun In The Interview With 'Toofaan' Movie Dialogues | Filmibeat
  ఎప్పుడూ తమన్ అయితే

  ఎప్పుడూ తమన్ అయితే

  అయితే ఎప్పుడూ తమన్ విషయంలో ఇలాంటి ఆరోపణలు వస్తుంటాయి. కానీ ఈసారి దేవిశ్రీప్రసాద్ మీద ఇలాంటి ఆరోపణలు రావడం గమనార్హం. అయితే ఇలా గతంలో ఏదో ఒక చోట బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. కానీ దాన్ని కాపీ కొట్టినట్లు భావించకూడదని అది యాదృచ్చికంగా జరిగింది కానీ కాపీ అని భావించకూడదు అని కొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ పుష్ప కాపీ వ్యవహారం మాత్రం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది.. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా సునీల్, ఫహద్ ఫాజిల్, అనసూయ లాంటి వాళ్లు కీలక పాత్రలో నటిస్తున్నారు.

  English summary
  Dakko Dakko Meka, the first single from Pushpa The Rise was unveiled by the makers today. now copy allegations on Daakko Daakko Meka song arise in social media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X