»   » రామ్ చరణ్ తేజ్ కి డీ గ్లామరైజ్డ్ వర్క్ అవుట్ అవుతుందా...!?

రామ్ చరణ్ తేజ్ కి డీ గ్లామరైజ్డ్ వర్క్ అవుట్ అవుతుందా...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళంలో ధనుష్, తాప్సీ జంటగా రూపొందిన 'ఆడుకలమ్" ఈ సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని ఇటీవల రామ్ చరణ్ చూశాడు. ఈ చిత్రం తెలుగు రీమేక్ లో నటించడానికి అతను ఆసక్తి కనబర్చాడనే వార్తలు వినిపిస్తున్నాయి. 'కోడిపందాల" బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి సినిమాల పందెంలో నంబర్ వన్ గా నిలిచింది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ధనుష్ చాలా మాస్ గా, డీ గ్లామరైజ్డ్ పాత్ర చేశాడు.

మరి చరణ్ ఈ డీ గ్లామరైజ్డ్ రోల్ చేయాలనుకోవడం అభినందించదగ్గ విషయమే. అయితే చరణ్ నటించిన మొదటి చిత్రం 'చిరుత" కూడా డీ మాస్ క్యారెక్టర్ చేయడంతో యావరేజ్ అనిపించుకొన్నది. తర్వాత మగధీర లాంటి సోసియోఫాంటసీ సినిమాని ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగలిగాడు. కాగా మళ్లీ అలాంటి మాస్ అండ్ డీ గ్లామరైజ్డ్ సినిమా అంటే మరి దాని ఫలితమేంటో ఒక సారి ఆలోచించాల్సిదే అని సన్నిహితులు సలహాలిస్తున్నారట.

English summary
Aadukalam, starring Dhanush and Taapsee was a hit film that was released during Pongal in Tamil. Ram Charan is interested in doing the movie in Telugu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu