»   » సెంటిమెంట్ ప్రకారమే మంచు విష్ణు అలా...

సెంటిమెంట్ ప్రకారమే మంచు విష్ణు అలా...

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Manchu Vishnu
  హైదరాబాద్ : సిని పరిశ్రమలో ఉన్నన్ని సెంటిమెంట్స్ ఎక్కడా ఉండవంటారు. ముఖ్యంగా కోట్ల బిజినెస్ తో అతి తక్కువ కాలంలో తేలిపోయే బిజినెస్ కావటంతో హీరోలు,నిర్మాతలు,దర్శకులు ఎవరికి వారే సెంటిమెంట్స్ ని తమదైన శైలిలో తమ ప్రాజెక్టులకు అప్లై చేస్తూంటారు. తాజాగా మంచు విష్ణు కూడా అదే రూటులో ప్రయాణిస్తున్నాడు అంటున్నారు సిని జనం. ఆయన గత చిత్రం దేనికైనా రెడీ హిట్టవటంతో..ఈ సారి కూడా అదే రోజు అంటే అక్టోబర్ 24న తన తాజా చిత్రం దూసుకెళ్తాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.


  అంతేగాక ఆ చిత్రానికి మొదటి అక్షరం "D" తో ప్రారంభం కావటంతో ఈ సారి అలాంటి టైటిలే దూసుకెళ్తా అని ఫిక్స్ చేసారు. దూసుకెళ్తా ఇంగ్లీష్ లో రాసేటప్పుడు "D" వస్తుంది. ఇక ఆయన కెరీర్ లో మొదటి హిట్ చిత్రం ఢీ కూడా "D" తోనే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తే ఇదే సెంటిమెంట్ గా తర్వాత తన కెరీర్ లో వచ్చే చిత్రాలకు కూడా ఖచ్చితంగా ఫాలో అయ్యే అవకాసం ఉందని చెప్తున్నారు. ఇక దూసుకెళ్తా చిత్రంపై దర్శక,నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని చెప్తున్నారు.

  విష్ణు మాట్లాడుతూ ''కథకు అతికినట్లు సరిపోయే పేరు అదే. వినోదం, యాక్షన్‌ అంశాలు సమపాళ్లలో మేళవించి ఉంటాయి. నిదానమే ప్రధానం.. అనే మాట అస్సలు పట్టించుకోడు. వేగం కూడా విస్తుపోయేలా దూసుకెళ్తేనే విజయం.. అనేది అతను నమ్మే సిద్ధాంతం. ఆ ప్రయాణంలో అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే ''అన్నారు.


  ఈ చిత్రానికి వీరూ పోట్ల దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ బాబు నిర్మాత...అందాల రాక్షసి ఫేమ్ లావణ్య హీరోయిన్. 24 ఫ్రేమ్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఈ చిత్రం టైటిల్ కి తగినట్లే విజయం వైపు దూసుకు వెళ్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు దర్శక,నిర్మాతలు. ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసరాల్లో చిత్రీకరణ సాగుతోంది. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, ఆహుతి ప్రసాద్‌, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: సర్వేష్‌ మురారి, కళ: రఘు కులకర్ణి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: విజయ్‌, సమర్పణ: అరియానా, వివియానా.

  English summary
  Manchu Vishnu's Doosukeltha is in the final stages of shooting and is gearing up for release shortly. Plan is to release the film on October 24th, on the same day his last film, Denikiana Ready was released. He believes in this kind of sentiments, for he also selected the title starts with 'D'’. Two of his biggest hits in his career also have D titles - Dhee and Denikaina Ready. So he chose Doosukeltha for this film.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more