ఆ హిందీ చిత్రం స్పెషల్ షో చూసిన మహేష్
సల్మాన్ ఖాన్ తాజా చిత్రం దబాంగ్ సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం స్పెషల్ షోను మహేష్ తన బార్య నమ్రతతో కలిసి ప్రసాద్ ల్యాబ్ లో చూసారు. సల్మాన్ ఖాన్ సోదరుడు దబాంగ్ నిర్మాత అయిన అర్బాజ్ ఖాన్ ఈ చిత్రం షో ను ఎరేంజ్ చేసారు. ఇక మహేష్..తన ఖలేజా చిత్రం డబ్బింగ్ పూర్తి చేసుకుని ఈ చిత్రం చూడ్డానికి ప్రసాద్ ల్యాబ్ కి వచ్చారు. ఇక మహేష్ సూపర్ హిట్ చిత్రం పోకిరిని...అప్పట్లో సల్మాన్ చూసి ముచ్చట పడి వాంటెడ్ పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టారు. ఇప్పుడు కూడా...మహేష్ ఈ చిత్రం చూసి ఏమన్నా చేద్దామనే ఆలోచనలో ఉన్నారేమో చూడాలి.
More from Filmibeat
మహేష్ బాబు దబాంగ్ పోకిరి పూరి జగన్నాధ్ వాంటెడ్ ప్రభుదేవా mahesh babu khaleja wanted puri jagannath prabhu deva pokiri


Click it and Unblock the Notifications











