»   » దగ్గుబాటి రాణా, కంగనా రౌనత్ తో కలసి 'దమ్ మారో దమ్'

దగ్గుబాటి రాణా, కంగనా రౌనత్ తో కలసి 'దమ్ మారో దమ్'

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కుమారుడు దగ్గుపాటి రాణా హిందిలో ఓ చిత్రం చేయనున్నాడనే సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి దమ్ మారో దమ్ అనే టైటిల్ పెట్టినట్లు సమాచారం. రోహిత్ సిప్పీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. హాలీవుడ్ హిట్ ట్రాఫిక్ ఆధారంగా రూపొందే ఈ చిత్రంలో రాణా సెకెండ్ హీరోగా చేస్తున్నారు. అభిషేక్ బచ్చన్ మెయిన్ హీరోగా చేస్తున్నారు. ఇక రాణాకి లీడ్ హీరోయిన్ గా కంగనారౌనత్ చేస్తోంది. ప్రబాస్ తో ఏక్ నిరంజన్ లో చేసిన ఆమెకి ఆ తర్వాత తెలుగులో ఆఫర్స్ రాలేదు. ఇక కంగనా ఈ చిత్రంలో డ్రగ్స్ కి ఎడిక్ట్ అవుతుంది. విలన్ గా ఆదిత్యా పంచోలి చేస్తున్నారు. ఆదిత్యాపంచోలి ఆమెను అనుకోని పరిస్ధితుల్లో చంపేస్తాడు. దాంతో రాణా రెచ్చిపోయి లీడ్ హీరో సాయిం తీసుకుని ఆ డ్రగ్ మాఫియాని ఎట్లా ఛేధిస్తాడనేది మిగతా కథ అని తెలుస్తోంది. ఇక రాణా హీరోగా చేసిన లీడర్ సినిమా త్వరలో రిలీజ్ కాబోతోంది. హ్యాపీడేస్ ఘన విజయం తర్వాత శేఖర్ కమ్ముల ఎవియం బ్యానర్ పై ఈ లీడర్ చిత్రాన్ని రూపొందించారు. ముఖ్యమంత్రి కుమారుడు ముఖ్యమంత్రి అయ్యే కాన్సెప్ట్ తో లీడర్ చిత్రం ముందుకు రానుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X