For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాగచైతన్య చిత్రం విడుదలపై 'ఢమురకం' ఎఫెక్ట్?

  By Srikanya
  |

  హైదరాబాద్ : నాగార్జున తాజా చిత్రం 'ఢమురకం' రకరకాల సమస్యల వల్ల అనుకున్న తేదీకి విడుదల కాకపోవటం జరిగిన విషయం తెలిసిందే. దీపావళికి విడుదలై నాగ్ అభిమానులును ఆనందపరుస్తుదనుకున్న ఈ చిత్రం పూర్తి స్ధాయిలో నిరాసపరిచింది. ఈ నేపధ్యంలో ఇదే బ్యానర్ లో నాగార్జున కుమారుడు నాగచైతన్య హీరోగా రూపొందుతున్న చిత్రం 'ఆటోనగర్ సూర్య' విడుదలపై ఈ ఎఫెక్ట్ పడుతుందంటూ వార్తలు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్నాయి. అందులోనూ 'ఆటోనగర్ సూర్య' చిత్రం కూడా చాలా కాలం క్రితం షూటింగ్ మొదలైంది. రిలీజ్ డేట్స్ మారుతూ వచ్చాయి.

  దేవ కట్టా దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందుతున్న చిత్రం 'ఆటోనగర్ సూర్య'. ఈచిత్రాన్ని నవంబర్ 9న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు విడుదల మరో నెల ముందుకు వెళ్లిపోయింది. డిసెంబర్ 2 వ తేదీన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ విడుదల చేయాలని నిర్ణయించినట్లు దేవకట్టా ట్విట్టర్ లో తెలియచేసారు. ఆయన ట్వీట్ చేస్తూ... "మా నిర్మాత 'ఆటోనగర్ సూర్య' విడుదల ని డిసెంబర్ 2 న విడుదల చేయాలని నిర్ణయించారు. సాంగ్స్ మాత్రం బాలెన్స్ ఉన్నాయి. ఆడియో విడుదల ముందు ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తాము. రెండు పాటలు పూర్తైతే షూటింగ్ పూర్తైపోయినట్లే .." అన్నారు. అయితే ఇప్పుడా రిలీజ్ ఉంటుందా ఉండదా అనేది సందేహమే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

  ఈ చిత్రంలో నాగచైతన్య స్కిల్ డ్ మెకానిక్ గా కనిపించనున్నారు. నాగాచైతన్య పాత్ర గురించి వివరిస్తూ... "చైతూ ఈ చిత్రంలో స్కిలెడ్ మెకానిక్ గా కనిపించనున్నారు. పూర్తిగా హీరో సెంట్రిక్ స్క్రిప్టు ఇది. ప్రస్దానం కన్నా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది అన్నారు. ఇక దేవకట్టాకు డైలాగ్స్ విషయంలో మంచి గ్రిప్ ఉందని గతంలో ప్రస్దానం నిరూపించింది. ఆ చిత్రంలో లోతైన భావమున్న డైలాగులుకు మంచి పేరు వచ్చింది. అలాగే ఈ చిత్రకు మొదట ఆడియో టీజర్ విడుదల చేసి మరీ క్రేజ్ క్రియేట్ చేసారు" అన్నారు.

  ఇక ఈ చిత్రంలో స్టోరీ లైన్ ఏమిటంటే...విజయవాడలో బెంజ్‌ సర్కిల్‌ ఎంత ఫేమసో... ఆటోనగర్‌ సూర్య కూడా అంతే. తనకు తెలిసిన పని చేసుకొంటూ... ఆ రంగంలో ఎదగాలనుకొనే రకం. ఒకరి హక్కును కబ్జా చేస్తే మాత్రం ఊరుకోడు. అందుకే సూర్య పేరు చెబితే రౌడీమూక గుండెల్లో కంగారు మొదలవుతుంది. ఇలాంటి మనస్తత్వమున్న సూర్య జీవితంలోకి ఎవరెవరు వచ్చారు? అతని ప్రయాణానికి అడ్డుగా నిలిచిన వారికి ఎలా బుద్ధిచెప్పాడు? తదితర విషయాలు తెలియాలంటే 'ఆటోనగర్‌ సూర్య' చిత్రం చూడాల్సిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా సమంత చేస్తోంది. ఈ చిత్రంలో సాయికుమార్‌ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. సంగీతం: అనూప్‌రూబెన్స్‌, సమర్పణ: ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.

  English summary
  
 Due to ‘Damarukam’ impact, the question being asked is, will ‘Autonagar Surya’ be in a position to come out? Ideally the film was expected in December but now it will not be very easy because ‘Damarukam’ is yet to come out and no one knows what its business result will be. Both these films are made by R R Movie Makers and currently they are in a firefighting situation due to lack of money.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X