For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లీడర్ లో చేసిన పొరపాటు చేయకుండా.. శేఖర్ కమ్ములకు ధనుష్ ఫుల్ ఫ్రీడమ్!

  |

  టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది దర్శకులు ఉన్నా కూడా వారందరికంటే పూర్తి భిన్నంగా సినిమాలు తీసే ఏకైక దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు. ఆయన టైమింగ్ లో సినిమాకి చేయడం ఎవరి తరం కాదనే చెప్పాలి. ఎలాంటి కథ అయినా సరే చాలా సున్నితంగా ప్రజెంట్ చేయగల శేఖర్ కమ్ముల మ్తో సినిమా చేయడానికి ఓ వర్గం నటీనటులు ఎంతో ఆసక్తిని చూపిస్తారు. శేఖర్ కమ్ముల కూడా బడా స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని చాలాసార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ ఎందుకో వర్కవుట్ కాలేదు. మహేష్ బాబుతో ఫిదా సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ మహేష్ అభిమానులు ఎలాంటి సినిమాను మాత్రం కోరుకోరని అపోహలతో అలా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ మహేష్ కు ఫిదా కథ మాత్రం బాగానే నచ్చింది.

  ఇక మహేష్ బాబు కూడా శేఖర్ కమ్ముల తో వర్క్ చేయాలని ఎప్పటినుంచో ఉంది కానీ సరైన కదా సెట్ అవ్వడం లేదు. శేఖర్ కమ్ముల మాత్రం స్టార్ హీరోలతో కూడా మంచి ప్రేమ కథలు చేస్తానని నమ్మకం వ్యక్తం చేశాడు. తనపై నమ్మకం ఉంచగలిగితే తప్పకుండా మ్యాజిక్ క్రియేట్ చేయగలనని కూడా చాలా ఇంటర్వ్యూలలో చెప్పాడు. ఇక ఇలాంటి దర్శకుడిని బలంగా నమ్మిన వారిలో తమిళ స్టార్ హీరో ధనుష్ ఒకరు. ఇటీవల వీరి కాంబినేషన్ పై అఫీషియల్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అసలైతే శేఖర్ కమ్ముల కథలు రాసుకున్నప్పుడే ఎవరైనా తమిళ హీరోను సెట్ చేసుకోవాలని అనుకున్నాడట. ధనుష్ సినిమా చేస్తాడా లేదా అనుకున్నప్పటికీ ఏషియన్ సినిమాస్ సహకారంతో ధనుష్ ను సంప్రదించి సినిమాను ఫిక్స్ చేసుకున్నాడట.

  Danush given full freedom to hero danush

  ఇక ఈ సినిమా స్క్రిప్ట్ మొత్తం దాదాపు పూర్తయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే దర్శకుడు చాలా బిజీగా ఉన్నాడు. సినిమాను ఒకేసారి మూడు భాషల్లో రూపొందించనున్నారు. మద్రాస్ నేపథ్యంలోనే పొలిటికల్ స్టోరీగా తెరకెక్కిస్తున్నట్లుగా కొంత టాక్ అయితే వస్తోంది. అయితే గతంలో శేఖర్ కమ్ముల పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో లీడర్ సినిమా చేసిన విషయం తెలిసిందే. రానా హీరోగా నటించిన ఆ సినిమా అంతా బాగానే ఉంటుంది. కానీ మధ్య మధ్యలో సెకండ్ హీరోయిన్ కు సంబంధించిన సీన్స్ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవ్వలేదని కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి.

  అయితే ఈసారి అలాంటి పొరపాటు చేయకుండా శేఖర్ కమ్ముల చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం తాను చెప్పాలనుకున్న కథను మాత్రమే ప్రజెంట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ధనుష్ ఎలాంటి కథను ఓకే చేసిన కూడా దర్శకుడితో కథ, స్క్రీన్ ప్లే లో కూడా తన అనుభవాలను చెప్పకుండా కొంత మార్పులు చేయించడం కామన్. అలా చేసి చాలా సినిమాల విజయంలో ధనుష్ సక్సెస్ అయ్యాడు కూడా. దర్శకుడికి ఇష్టం అయితేనే ధనుష్ స్క్రిప్ట్ విషయంలో కలుగ చేసుకుంటాడు అని కోలీవుడ్ మీడియాలో అయితే ఒక టాక్ ఉంది. అయితే శేఖర్ కమ్ముల గురించి తెలుసుకున్న ధనుష్ అతడికి మాత్రం ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏ మాత్రం కలుగ చేసుకోకుండా సినిమా చేయాలని ధనుష్ ఫిక్స్ అయ్యాడట. మరి శేఖర్ కమ్ముల ధనుష్ నమ్మకాన్ని ఎంతవరకు సక్సెస్ చేస్తాడో చూడాలి.

  English summary
  Director danush big hopes on shekar kammula making before project starts and no objections in script work,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X