»   » డబుల్ గేమ్ ఆడుతున్న దాసరి కి రూల్స్ వర్థించవా...!

డబుల్ గేమ్ ఆడుతున్న దాసరి కి రూల్స్ వర్థించవా...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం జరుగుతున్న బంద్ కారణంగా షూటింగులన్నీ ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. విదేశాల్లో ఇప్పటికే షూటింగ్ జరుగుతున్న సినిమాలు మినహాయించి మిగిలిన సినిమాలన్నీ ఆగిపోయాయి. విదేశీ షెడ్యూల్ వేసుకుని బయల్దేరబోతున్న యూనిట్స్ కూడా వెళ్లకుండా ఉండిపోయాయి. అయితే ఇదేమీ పట్టనట్టు 'పరమవీరచక్ర"బృందాన్ని పాటల చిత్రీకరణ కోసం విదేశాలకి దాసరి నారాయణ రావు పంపించేశారు. తాను వెళ్లకుండా ఇక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

అందరికీ రూల్సు చెప్పే దాసరి నారాయణరావుకి అవి వర్తించవా అంటూ చిత్ర పరిశ్రమ భగ్గుమంటోంది. తామంతా వెర్రి వెంగలప్పల్లా షూటింగులు ఆపుకుని కూర్చుంటే దాసరి మాత్రం తన సినిమా యూనిట్ ని విదేశాలకి పంపించమేంటని, ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందేనని ఒక వర్గం గట్టిగా పట్టుబడుతోంది. అయితే పెద్దరికం ముసుగులో ఇప్పటికే ఎన్నోచెత్త కార్యక్రమాలకి పాల్సడుతున్న దాసరి మాత్రం ఇదంతా లెక్కలేనట్టే వ్యవహరిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu