మంచు మల్టిస్టారర్ లో కీ రోల్ దాసరి

ఈ చిత్రంలో వరుణ్ సందేశ్, తనీష్‌లు కూడా నటిస్తున్నారు. రవీనాటాండన్, హన్సిక, ప్రణీత హీరోయిన్స్. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో దాసరి ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తారని సమాచారం. దాసరి- మోహన్‌బాబుల మధ్య గురుశిష్యుల సంబంధం ఉంది. ఆ అనుబంధంతోనే దాసరి ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకొన్నారని తెలిసింది.
వచ్చే నెలలో దాసరి, ఇతర ప్రధాన తారాగణంపై సన్నివేశాలను తెరకెక్కిస్తారు. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రం గోల్ మాల్ 3 కి రీమేక్ అని తెలుస్తోంది. హన్సిక ఈ విషయమై ఆ మధ్య ట్వీట్ చేసింది. బాలీవుడ్లో సంచలన విజయం నమోదు చేసిన గోల్ మాల్ 3 ఇప్పుడు తెలుగులో మంచు ఫ్యామిలీతో తెరకెక్కుతోందని సమాచారం. రోహిత్ శెట్టి దర్సకత్వంలో రూపొందిన ఆ చిత్రం అక్కడ సంచలన విజయం సాధించింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తో రూపొందిన ఈ చిత్రంలో అజయ్ దేవగన్, అర్షద్ వార్సీ, తుషార్ కపూర్ హీరోలుగా చేసారు. కరీనా కపూర్ హీరోయిన్ గా చేసింది.
మోహన్ బాబుకు జోడీగా బాలీవుడ్ నటి రవీనా టండన్ నటిస్తోంది. ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు. మంచు విష్ణు, మనోజ్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీమోహన్, కోన వెంకట్, బివిఎస్ రవి స్క్రిప్టు అందిస్తున్నారు. ఎంఎం కీరవాణి, బప్పీ లహరి, ఆచ్చు, బాబా సెహగల్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











