»   » 'ఛీ'రంజీవి అనిపించేందుకు సిద్ధం అవుతున్న దాసరి 'యంగ్ ఇండియా'

'ఛీ'రంజీవి అనిపించేందుకు సిద్ధం అవుతున్న దాసరి 'యంగ్ ఇండియా'

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, దాసరి నారాయణ రావుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. దాసరి నటించి తీసిన సినిమా మేస్త్రిలో చిరంజీవిని తూర్పారబట్టిన దాసరి తను తాజాగా నూతన నటీనటులను పరిచయం చేస్తూ నిర్మించతలపెట్టిన సినిమా యంగ్ ఇండియాలో కూడా చిరంజీవి మీద సెటైర్లు వెయ్యనున్నట్టు సినీవర్గాల కథనం.

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి 'మదర్ థెరిస్సా 108 సర్వీసు' అని అంబులెన్స్ లతో ఓ సీన్ ను షూట్ చేసారంట. ఇప్పుడున్న రాజకీయనాయకుల్లో చిరంజీవి ఒక్కరే మదర్ థెరిస్సాను తమ ఆదర్శం అని ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సన్నివేశంలో మదర్ థెరిస్సా పేరు చెప్పుకొని చాలా మంది ఎలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారో అని చూపించారట. ఇది విన్న సినీజనం మాత్రం దాసరి మరో సారి చిరంజీవిని టార్గెట్ గా చేసుకొని సినిమా రూపొందిస్తున్నాడు... మరిందులో చిరును ఏ విధంగా కడిగిపారేసాడో అని చర్చించుకుంటున్నారట. మరి ఆ విషయం తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకూ ఎదురుచూడాల్సిందే మరి...!!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu