»   » రివేంజ్ కోసమే దాసరి ఆ హీరోని ఎంపిక

రివేంజ్ కోసమే దాసరి ఆ హీరోని ఎంపిక

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు కి ఇప్పుడు ఓ హీరో అత్యవసరం.అయితే యంగ్ హీరోలు కానీ, సీనియర్ హీరోలు కానీ ఆయనకు డేట్స్ ఇచ్చే స్ధితిలో ఎవరూ కనపడటం లేదు. ఆయన రీసెంట్ గా బాలకృష్ణతో పరమవీర చక్రతో ఇచ్చిన ప్లాఫ్ భయంతో కావచ్చు లేదా..మెగా క్యాంప్ తో విరోధమెందుకని అనుకోవచ్చు ఏది కారణమైనా ఆయనతో చేయటానికి ఎవరూ ముందుకురావటం లేదు. ఈ నేపధ్యంలో ఆయన చిరంజీవి క్యాంప్ మీద రివెంజ్ తీర్చుకోవటానకి తగిన హీరో కోసం ఎదురుచూస్తున్నారు. అందుకు రాజశేఖర్ ఒక్కరే సరైన వ్యక్తి అనిపించారు. ప్రస్తుతం మహంకాళి షూటింగ్ లో యాక్సిడెంట్ అయి హాస్పటిల్ లో కోలుకుంటున్న ఆయన్ని దాసరి సంప్రదించి ఊరడించి శత్రువు..శత్రువు మిత్రుడు తరహాలో కాంబినేషన్ సెట్ చేసాడని వినికిడి. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ మీదా,చిరంజీవి పొలిటకల్ లైఫ్ మీద సెటైర్స్ ఉంటాయని, సినిమా కథ ఎలాగున్నా అని వినపడుతోంది. మొత్తానికి రామ్ చరణ్ ట్విట్టర్ ద్వారా అంటించిన నిప్పు దాసరిలో అగ్నిని రగిల్చి రాజశేఖర్ కి సినిమమా వచ్చేలా చేసింది. అదీ సంగతి.

English summary
It can be recalled that Dasari Narayana Rao made the film 'Ahankari' with Rajasekha r. It is now learnt that the director will be making another film starring Rajasekha r soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu