»   » బన్నితో నాకు అలా చేసే చాన్స్ వచ్చింది..!?

బన్నితో నాకు అలా చేసే చాన్స్ వచ్చింది..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ధనవంతుల అమ్మాయిగా 'వేదం" లో నటించిన దీక్షసేథ్ అసలు పేరు వైశాలి. ఇంట్లో అంతా అలానే పిలుస్తారు. మిస్ ఇండియా 2009 పోటీల్లో పాల్గొని 'మిస్ ప్రెస్ ఫేస్" అవార్డు కార్యక్రమంలో ఆమెను చూసిన దర్శకుడు క్రిష్ వేదంలో పాత్ర గురించి చెప్పారట. కానీ 'వేదం"లో ధనవంతుల అమ్మాయిగా నటించే ఛాన్స్ బన్నీ ద్వారానే తనకు వచ్చిందని వైశాలి అంటోంది. సౌత్ స్కోప్ అవార్డు కార్యక్రమంలో నన్ను చూసిన క్రిష్ వేదంలో పాత్ర గురించి చెప్పారు. ఆ తర్వాత బన్నీకి పరిచయం చేశారు. ఆయనకూ నేను నచ్చడంతోనే, వేదంలో నటించే అవకాశం నాకు వచ్చింది అని వైశాలి చెప్పింది.

ఇంకా వైశాలి మాట్లాడుతూ 'బన్నీ సెట్లో ఉంటే అందరినీ నవ్విస్తూ ఉత్సాహపరుస్తారు. ఆయనతో ఉంటే కొత్త ఉత్సాహం వస్తుంది. అనుష్క చాలా అందంగా ఉంటుంది. వేదంలో సరోజ పాత్రలో లీనమైపోయింది" అని ఈ పంజాబి భామ కితా బిచ్చింది. ఇంకేముంది? వైశాలి మటాలను బట్టి చూస్తే బన్నీకి నచ్చితేనే హీరోయిన్ సెలక్షన్ జరుగుతుందన్న మాటా నిజం చెసినట్టుందని సినీ పండితుల సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu