»   » దీక్షను వదల్లేక అల్లు అర్జున్

దీక్షను వదల్లేక అల్లు అర్జున్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్,క్రిష్ కాంబినేషన్ లో వచ్చిన వేదం చిత్రంలో అల్లు అర్జున్ సరసన చేసిన దీక్ష ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతోంది.అయితే ఇప్పుడామెను తన చిత్రంలో అల్లు అర్జున్ కావాలని పెట్టించుకున్నట్లు సమాచారం.అయితే హీరోయిన్ గా ఆమెకు ఛాన్స్ ఇవ్వలేము కానీ ఐటం సాంగ్ కు ఆమెను తీసుకుందామని ఒప్పించారని చెప్పుకుంటున్నారు.ఈ సినిమాని యూనివర్సల్ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు 'హానీ" అనే టైటిల్ తో పాటు 'హి ఈజ్ వేరి స్వీట్" అనే క్యాప్షన్ పెట్టనున్నారు. ఈ చిత్ర షూటింగ్ సెప్టెంబర్ 7న ఆరంభం కానుంది. బన్ని తన భార్యతో కలిసి పర్సనల్ ట్రిప్ కి వెళ్ళాడని, వచ్చే నెల తొలివారంలో వస్తాడని సమాచారం. ఇలియానా కూడా సెప్టెంబర్ మొదటి వారంలో షూటింగ్ లో పాల్గొననుంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.ఈ చిత్రంలో ఇలియానా చాలా హాట్ గా ఉంటుందని,బన్నీ చాలా స్వీట్ గా ఉంటాడని చెప్పుకుంటున్నారు.

English summary
Under Trivikram Srinivas direction Allu Arjun & Ileana are acting together under universal media banner.In this movie Deeksha Seth is doing item song with Allu Arjun.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu