»   » బిజినెస్ స్ట్రాటజీ :'బాహుబలి -2' లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్

బిజినెస్ స్ట్రాటజీ :'బాహుబలి -2' లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎప్పుడైతే 'బాహుబలి' చిత్రాన్ని కరుణ్ జోహార్ తీసుకున్నాడో అప్పుడు దాని సినేరియా మారిపోయింది. ఇప్పుడు 'బాహుబలి -2' రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో కొందరు బాలీవుడ్ స్టార్స్ ఉంటే ఖచ్చితంగా బిజినెస్ కలర్ మారుతుందనేది నిజం.

ఈ విషయం బాహుబలి నిర్మాతలు చర్చించి, ఈ సినిమాలో కీలకమైన పాత్రకు గానూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోని ని తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈమేరకు ఆమెతో చర్చలు సైతం జరిపినట్లు బాలీవుడ్ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఆ పాత్ర తెరపై చాలా తక్కువ సేపు ఉంటుందని తెలుస్తోంది. దాంతో దీపిక ఆలోచనలో పడిందని చెప్తున్నారు.


కానీ కరుణ్ జోహార్ ఆమెను ఒప్పుకోమని ఒత్తిడి తెస్తున్నారని, ఆమెకు ఆ మేరకు మంచి రెమ్యునేషన్ సైతం ఆఫర్ చేసారని తెలుస్తోంది. బాహుబలి వంటి ప్రతిష్టాత్మక చిత్రంలో చేయటం తనకు సంతోషమే కానీ మరీ అంత చిన్న పాత్రలో కనిపించటం వలన ఒరిగేదేమి ఉంటుందని ఆమె అభిప్రాయపడుతున్నట్లు చెప్తున్నారు.


Deepika Padukone to act in Baahubali 2?

అనుకున్నది అనుకున్నట్లు జరిగితే 'బాహుబలి -2' చిత్రాన్ని ప్రమోట్ చేసేటప్పుడు ఆమె బాగా ఉపయోగపడుతుంది. అలాగే అక్కడ ప్రేక్షకులు సైతం మరింతగా ఈ చిత్రానికి కనెక్ట్ అయ్యే అవకాసం ఉంది.


చిత్రం గురించి రాజమౌళి మాట్లాడుతూ ''మామూలుగా ఓ సినిమాను రెండు, రెండున్నర గంటలు తీస్తాం. కానీ బాహుబలి కథ పెద్దది కావడం వల్ల నాలుగున్నర ఐదు గంటలకు చేరింది. రెండున్నర గంటల సినిమాలో గంట గంటన్నర పాత్రల పరిచయానికి సరిపోతుంది. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది.


కానీ మేం 'బాహుబలి'లో పాత్రల పరిచయానికి రెండు రెండున్నర గంటలు తీసుకున్నా. అసలు కథ 'బాహుబలి-2'లోనే ఉంటుంది. విజువల్‌ ఎఫెక్టులు, యుద్ధ సన్నివేశాలు తొలి భాగానికి ఏమాత్రం తగ్గని రీతిలో ఉంటాయి.


Deepika Padukone to act in Baahubali 2?

ఐతే వాటి కంటే కూడా ప్రధాన పాత్రల మధ్య ఎమోషన్లే రెండో భాగానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని నా నమ్మకం. బాహుబలి-శివగామి.. బాహుబలి-దేవసేన.. బాహుబలి- భల్లాల దేవ.. భల్లాలదేవ-దేవసేన.. ఇలా పాత్రల మధ్య ఏం జరిగింది.


ఆయా పాత్రల మధ్య ఎమోషన్‌ ఎలా ఉంటుంది అన్నది ప్రధానంగా రెండో భాగంలో చూపిస్తాం. అలాగే 2015 సంవత్సరానికి అతి పెద్ద ప్రశ్నగా మారిన 'బాహుబలి కట్టప్పను ఎందుకు చంపాడు' అన్నదానికి కూడా సమాధానం చెబుతాం'' అని అన్నారు.

English summary
Deepika Padukone might now be a part of S S Rajamouli’s Baahubali 2.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu