Just In
- 7 min ago
‘పుష్ప’లో మిస్ ఇండియా: ఆఖరికి ఆమెనే ఫైనల్ చేసిన సుక్కూ.. భారీగానే ఇస్తున్నారు
- 21 min ago
Acharya Teaser అప్డేట్.. చిరు స్టైల్లో సుప్రీమ్ హీరో రిప్లై
- 24 min ago
వామ్మో.. గెస్ట్ రోల్ కోసం అన్ని కోట్ల రూపాయల.. బుట్టబొమ్మ రేటు మామూలుగా లేదు
- 30 min ago
తెలంగాణ బొగ్గు గనుల్లోకి ప్రభాస్: అక్కడి నుంచే యాక్షన్ షురూ చేయనున్న రెబెల్ స్టార్
Don't Miss!
- Sports
సిక్సర్ కోసం ఎలాంటి ప్లాన్ వేయలేదు.. బయటకి వచ్చి బాదానంతే! అర్ధ శతకం పూరైంది: శార్దూల్
- News
నిమ్మగడ్డ స్పెషల్ ఆఫీసర్‌కు జగన్ సర్కార్ ప్రమోషన్- ఏడీజీగా మారిన ఐజీ సంజయ్
- Finance
బడ్జెట్‌కు ముందు వరుసగా పతనం, సెన్సెక్స్ 600 పాయింట్లు డౌన్: 4 రోజుల్లో 2300
- Automobiles
మేడ్ ఇన్ ఇండియా 'ప్రాణ' ఈ-బైక్ విడుదల; తయారు చేసింది ఎవరో తెలుసా?
- Lifestyle
పెరుగులో ఎండుద్రాక్షను నానబెట్టి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు! ఆశ్చర్యం కలిగిస్తుంది!!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'ఖలేజా' మెయిన్ ధీమ్ ఏమిటంటే...త్రివిక్రమ్ శ్రీనివాస్
దైవమ్ మానుష్య రూపేణా అనేది ఖలేజా చిత్రం ధీమ్. ప్రతీ మనిషిలోనూ భగవంతుడు ఉన్నాడు అనేదే చెప్పబోతున్నాం అంటున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన తాజా చిత్రం ఖలేజా గురించి. అలాగే సంఘటనల సమాహారమే జీవితం. మనిషి..భగవంతుడుగా మారటం ప్యూర్ గా ఇన్సిడెంట్. ఇదంతా మన పురాణాతిహాసాలు చెప్పేది దాన్నే ఫాలో చేసాం అన్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు..ఓ సాధారణ టాక్సీ డ్రైవర్. ఆ అతి సాధారణమైన మనిషి ఊహకు అందని ఓ సంఘటన వల్ల దైవత్వం నిండిన మనిషిగా మారతాడు. నిజాయితీగా చెప్పుతున్నా..మేము మొదట ఓ రెగ్యులర్ కమర్షియల్ మహేష్ బాబు సినిమా చేద్దామనుకున్నాం. కానీ లైఫ్ అనేది సినిమాకి దానంతట అదే వచ్చింది. ఈ చిత్రంలో మీరు ఓ కొత్త మహేష్ బాబుని చూస్తారు. అతను తన హద్దులు దాటి కామిడీని ఎలా పండించాడో తెలుస్తుంది. ఈ సినిమాలో అతనో కమిడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టు, ఐటం గై, యాక్షన్ హీరో, లవర్ బోయ్ ఇలా అన్నీ ఒకే పాత్రలో ఇమిడాయి.
ఖలేజా ఖచ్చింతంగా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కలిగిన ఓ కమర్షియల్ సినిమా. అలాగే సినిమా అంతా అనుష్క పాత్ర కీలకం. అది హిలేరియస్ సిట్యువేషన్స్ ఇస్తుంది. ఈ రేంజ్ హ్యూమర్ ని మహేష్ ఎటెమ్ట్ చేయటం ఇదే మొదటిసారి. నేను ఈ సినిమాని ప్రయోగమని చెప్పను గానీ ట్రీట్మెంట్ మాత్రం గ్యారెంటీగా ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. రెగ్యులర్ అంశాలు ఏమీ సినిమాలో కనపడవు. అలాగే మహేష్ బాబు ఈ చిత్రానికి హీరోనే కాదు అశోసియేట్ స్క్రిప్టు రైటర్ కూడా. అతను నాతో కలసి కంప్లీట్ గా స్క్రిప్టు వర్క్ లో పాలుపంచుకున్నాడు. అలాగే కెమెరా పరంగా కూడా కొత్త అంశాలు ఉంటాయి...అవన్నీ తెరమీద చూస్తేనే బావుంటాయి అని ముగించారు త్రివిక్రమ్.