»   » ఆ టైటిల్ దేవిశ్రీప్రసాద్ కోసం కాదు..మెగా హీరోకు?

ఆ టైటిల్ దేవిశ్రీప్రసాద్ కోసం కాదు..మెగా హీరోకు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : దిల్ రాజు రీసెంట్ గా ...'ఫీల్ మై లవ్' అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించారు. దాంతో ఆయన రీసెంట్ గా దేవిశ్రీప్రసాద్ హీరోగా చిత్రం ఎనౌన్స్ చేసి ఉండటంతో ఆ టైటిల్ ఆ ప్రాజెక్టుకు చెందినదే ఆ వార్తలు గుప్పుమన్నాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఆ టైటిల్ ఓ మెగా హీరో కోసం రెడీ చేసిందని తెలుస్తోంది. ఇంతకీ ఎవరా మెగా హీరో ...

దిల్ రాజు త్వరలో వరుణ్ తేజ హీరోగా ఓ చిత్రం నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. వెంకీ అనే కొత్త దర్శకుడుని పరిచయం చేస్తూ ఆ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. 2016 ప్రారంభంలో ఈ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం ఫీల్ మై లవ్ ని రిజిస్టర్ చేసారట దిల్ రాజు.

దేవీ శ్రీ సంగీతం అందించిన ఆర్యలోని పాట పల్లవి ఈ టైటిల్ కావటం, దిల్ రాజు రిజిస్టర్ చేయించటంతో అంతా దేవీ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు టైటిల్ ఇదే అని ఫిక్సైపోయారు. దానికి తోడు టాక్ వెబ్ మీడియాలోనూ మొదలైంది.

Devi Sri Prasad's Debut Film's Title?

వరుణ్ తేజ తాజా చిత్రం విశేషాలకు వస్తే...

పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వరుణ్‌తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'లోఫర్‌'. ఇది వరుణ్‌ తేజ్‌కు మూడో చిత్రం. సీకే ఎంటర్‌టైమెంట్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో పంక్షన్ డిసెంబర్ 8న జరగనుంది. శిల్ప కళా వేదికలో భారీగా జరగనున్న ఈ వేడుకకు ప్రభాస్ ఛీఫ్ గెస్ట్ గా వస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శర వేగంగా జరుగుతున్నాయి. ఫెమినా మిస్ ఇండియా 2013 రన్నరప్ దిషా పతాని ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడీగా నటిస్తోంది.

Devi Sri Prasad's Debut Film's Title?

సి.కల్యాణ్‌ మాట్లాడుతూ ''వరుణ్‌ తొలిసారి చేస్తున్న మాస్‌ సినిమా ఇది. యాక్షన్‌తో పాటు, సెంటిమెంట్‌కీ ప్రాధాన్యం ఉంది. కథానుసారమే టైటిల్‌ నిర్ణయించాం. చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తాము''అన్నారు.

బ్రహ్మానందం, రేవతి, పోసాని, ముఖేష్‌ రుషి, సంపూర్ణేష్‌బాబు, సప్తగిరి, పవిత్రలోకేష్‌, ఉత్తేజ్‌, భద్రమ్‌ తదితరులు నటించారు. సంగీతం: సునీల్‌ కశ్యప్‌. ఈ చిత్రంలో చరణ్ దీప్‌ విలన్ పాత్రలో నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మదర్ సెంటిమెంట్ కథాంశంగా రూపొందుతోంది.

English summary
DilRaju to produce VarunTej's film, it has been titled FeelMyLove. New-comer Venky is the director & will hit the floors in early 2016!
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu