»   » దేవిశ్రీప్రసాద్ ఇక కుమ్ముకోవచ్చు

దేవిశ్రీప్రసాద్ ఇక కుమ్ముకోవచ్చు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఉంటే మినిమం గ్యారెంటీ అనే భావం దర్శక,నిర్మాతల్లో ఉంది. తమ సినిమాకు బాగా ప్లస్ అవుతాడని హీరోలు సైతం దేవినే ప్రిఫర్ చేస్తూంటారు. తాజాగా ఆయనకు మరో పెద్ద ఆఫర్ వచ్చిందని సమాచారం. ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందే చిత్రానికి దేవినే సంగీత దర్శకుడుగా తీసుకున్నట్లు చెప్తున్నారు. గతంలో ఎన్టీఆర్ చిత్రాలైన అదుర్స్, ఊసరవెల్లి లకు దేవినే సంగీతం అందించారు. టైటిల్ కు తగ్గట్లే దేవి ఈ పాటలను కుమ్ముతా అని హామీ ఇచ్చే ఉంటారు.

ఇక ఈ చిత్రం ఎన్టీఆర్ పుట్టిన రోజున అంటే మే 20న హైదరాబాద్ గ్రాండ్ గా లాంచ్ కానుంది. తొలిసారిగా బయిట రచయిత కథతో పూరీ జగన్నాథ్ ఈ చిత్రం చేయబోతున్నారు. వక్కంతం వంశీ ఇచ్చిన కథతో ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చిత్రం రూపొందించటానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ గత చిత్రాలు అశోక్, ఊసరవెల్లికి కూడా వక్కంతం వంశీనే రచయిత కావటం విశేషం. ఈ మధ్యన ఎన్టీఆర్ ని ఓ కథతో వంశీ ఒప్పించారు. ఇప్పుడు అదే కథతో పూరీ డైరక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Devi Sri Prasad tuning for NTR's flick

పూరీ జగన్నాథ్ కేవలం పది రోజుల్లో వండి వడ్డించే కథలపై ఎన్టీఆర్ కి నమ్మకం లేకే పూరీ జగన్నాథ్ బయిట కథని తీసుకోవాల్సి వచ్చిందంటున్నారు. పూరీ జగన్నాథ్ నాలుగైదు కథలు వినిపించాడని, ఏ కథా ఎన్టీఆర్ ని ఇంప్రెస్ చేయలేకపోయిందని, అప్పుడు వంశీ కథతో చేయమని ఎన్టీఆర్ చెప్పారని తెలుస్తోంది. ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరోతో సినిమా చేయటం ప్రధానం అనుకున్న పూరీ ఇమ్మీడియట్ గా కథ విని, డైలాగ్స్ రాసుకోవటానికి సిద్దమయ్యారు. ఇది మంచి పరిణామం అంటున్నారు. ఖచ్చితంగా ఈ సారి కమర్షియల్ బ్లాక్ బస్టర్ వచ్చే అవకాసం ఉందంటున్నారు.

అలాగే టైటిల్ సైతం ఎన్టీఆర్ ఇమేజ్ కు తగ్గట్లుగా 'కుమ్మేస్తా' అని పెట్టినట్లు సమాచారం. ఇక పూరీ జగన్నాథ్ సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నారు. దాంతో ఈ చిత్రం మరో 'ఆంధ్రావాలా' అవుతుందా లేక నిజంగానే కలెక్షన్స్ కుమ్ముతుందా అనేది తేలాలి.

English summary
Devi Sri Prasad is getting ready to score music for NTR's next under Puri Jagannath's direction.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu