»   »  'నాన్నకు ప్రేమతో' పై దేవిశ్రీప్రసాద్ కామెంట్

'నాన్నకు ప్రేమతో' పై దేవిశ్రీప్రసాద్ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : జూ.ఎన్టీఆర్ నటించి సంక్రాంతికి విడుదల అవుతున్న సినిమా 'నాన్నకు ప్రేమతో'. ఈ చిత్రం ఇప్పటికే చూసిన దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రం గురించి బ్యూటిఫుల్ కామెంట్స్ చేసి అభిమానులను ఆనందపరిచారు. ఇంతకీ ఆయనేం అన్నారో మీరే చూడండి.


ఈ ట్వీట్ లో ముఖ్యంగా ఆయన ఎన్టీఆర్ ..మైండ్ బ్లోయింగ్ నటనను మెచ్చుకోవటం గమనించవచ్చు. ట్రైలర్స్ చూడగానే ఈ విషయం అభిమానులకు అర్దమైపోయింది. ఇప్పుడు దేవి ఖరారు చేసి చెప్పాడన్నమాట.


Devisri Prasad tweet on Nannaku Prematho

చిత్రం గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ...నాన్నపై అత్యంత ప్రేమ ఉన్న ఏడెనిమిది మంది కలసి తీసిన సినిమా ఇది. దేవిశ్రీ ప్రసాద్‌కీ వాళ్ల నాన్నంటే చెప్పలేనంత అభిమానం. అందుకోసమే చాలా కసిగా చేసాడు ఈ సినిమాను. ఈ సినిమాకు ఏ పేరు పెడితే బాగుంటుందా అని ఆలోచిస్తున్నప్పుడు నాకు సుకుమార్‌ సినిమాలు గుర్తుకొచ్చాయి. సినిమా చివర్లో అమ్మానాన్నలకి ప్రేమతో అని రాస్తుంటారు. అది గుర్తుకొచ్చి ‘నాన్నకు ప్రేమతో అని పెడితే ఎలా ఉంటుంది సర్‌' అన్నా. ‘చాలా బాగుంటుంది, ఇదే పెట్టేద్దాం' అన్నారాయన.


నాన్నకు ప్రేమతో' అనే పేరు తట్టడం కూడా ఈ కథ గొప్పదనమే. ఈ సినిమాలో ‘అందరూ టైమ్‌ని సెకండ్లలోనూ, నిమిషాల్లోనూ కొలుస్తారు. కానీ నేను మా నాన్న గుండె చప్పుడుతో కొలుస్తుంటా' అనే డైలాగ్‌ ఉంది. ఆ డైలాగ్‌ నుంచి పుట్టిందే సినిమా లోగోకు మధ్యలో ఉన్న గుండె చప్పుడు గుర్తు. అది నేను సూచించిందే అని సుకుమార్‌గారు చెప్పడం ఆయన గొప్పతనం. కానీ నాకు ఆయన చెప్పిన డైలాగ్‌తోనే ఆ చిహ్నం గుర్తుకొచ్చింది'' అని చెప్పుకొచ్చారు.


మరో ప్రక్క.. ఈ చిత్రం ఇప్పుడు సౌత్ ఇండియా లో తప్ప మిగతా ప్రాంతాలన్నిటిలోనూ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ విడుదల అవుతోంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. దాంతో ఈ చిత్రం భాష రాని వారిని కూడా రీచ్ అవుతుంది. ఎక్కువ ప్రాంతాల్లో విడుదల చేసేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటంతో ఎక్కువ రెవిన్యూ జనరేట్ అయ్యే అవకాసం ఉంది.English summary
DEVI SRI PRASAD ‏ tweeted:NAANNAKU PREMATHO-A TERRIFIC BEAUTIFUL Movie By Sukumar!! MINDBOGGLING PERFORMANCE by tarak9999 ! It wl Touch the Heart of each n evryone
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu