టాలీవుడ్ లీడింగ్ డైరెక్టర్ తో ధనుష్ ప్యాన్ ఇండియా సినిమా.. రేపే అధికారిక ప్రకటన!

దేశంలోని ప్రతిభావంతులైన నటులలో ధనుష్ ఒకరు అనడంతో ఎలాంటి సందేహం లేదు. తమిళ్ లో సంచలనాత్మక సినిమాలు చేస్తూ అక్కడ స్టార్ హీరోగా ఉన్న ఆయన పలు ఆసక్తికరమైన సినిమాలను లైనప్ లో పెట్టుకున్నారు. ఆయన చేస్తున్న దాదాపు అన్ని సినిమాలు కూడా తెలుగులో కూడా రిలీజ్ అవుతున్నాయి. అయితే ఆయన తెలుగులో డైరెక్ట్ సినిమా చేయబోతున్నారని దానికి సంబందించిన అధికారిక ప్రకటన రేపు వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

ఇతర బాషల హీరోలతో

ఇతర బాషల హీరోలతో

ఈ మధ్యకాలంలో భాషతో సంబంధం లేకుండా ఒక భాష హీరోని మరో భాషలో నటింపజేయడానికి దర్శకనిర్మాతలు ఉవ్విళ్ళూరుతున్నారు. అందులో భాగంగానే తమిళ స్టార్ హీరోగా ఉన్న విజయ్ తో మన తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి సినిమా చేస్తున్నాడని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. విజయ్ పుట్టినరోజు దానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.

ధనుష్ డైరెక్ట్ సినిమా

ధనుష్ డైరెక్ట్ సినిమా

ఇప్పుడు అలాగే తమిళ స్టార్ హీరోగా ఉన్న ధనుష్ తెలుగు దర్శకుడు ఒకరితో జట్టుకట్టే పోతున్నారని ప్రచారం మొదలైంది. నిజానికి ధనుష్ ఇప్పుడు తమిళంతో పాటు హిందీ సినిమాల్లో బిజీగా ఉన్నారు. అయితే ఆయన త్వరలో డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తారని చాలా రోజుల ముందు నుంచి ప్రచారం జరుగుతోంది.

ప్యాన్ ఇండియా సినిమాగా

ప్యాన్ ఇండియా సినిమాగా

ఎందుకంటే దాదాపుగా ధనుష్ నటిస్తున్న అన్ని తమిళ సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ అవుతున్నాయి. ఆ లెక్కన ధనుష్ కి టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఉంది. ఈ నేపధ్యంలోనే ఆయన చేత నేరుగా ఒక సినిమా చేయిస్తే దానిని తమిళంలో కూడా రిలీజ్ చేయవచ్చని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంతే కాక వీలయితే ప్యాన్ ఇండియా సినిమాగా కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

శేఖర్ కమ్ములతో ధనుష్

శేఖర్ కమ్ములతో ధనుష్

జరుగుతున్న ప్రచారం మేరకు సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల ధనుష్ తో కలిసి ఒక సినిమా ప్లాన్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రేపు వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ మీద ఏషియన్ సంస్థ నిర్మించే అవకాశం ఉందని అంటున్నారు.

Recommended Video

OTT New Releases : అందరి చూపు ఆ సినిమా పైనే | Cinema Bandi | Karnan || Filmibeat Telugu
లవ్ స్టోరీ

లవ్ స్టోరీ

శేఖర్ కమ్ముల చివరిగా నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా జరిగిన స్టోరీ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా నిజానికి ఏప్రిల్ నెలలోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి రెండో దశ పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ వాయిదా వేశారు. ఇప్పుడు జూలై నెలలో థియేటర్లో తెరుచుకుంటే సినిమా రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X