»   »  ధనుష్ హీరో గా తమిళ్ అర్జున్ రెడ్డి ?: తమిళ రీమేక్ కి ప్రయత్నాలు

ధనుష్ హీరో గా తమిళ్ అర్జున్ రెడ్డి ?: తమిళ రీమేక్ కి ప్రయత్నాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

అర్జున్ రెడ్డి ఈ మద్య కాలం లో టాలీవుడ్ లో ఈ సినిమా రేపినంత దుమారం మరే సినిమా విషయం లోనూ జరగలేదు టాలీవుడ్ సెన్సేషనల్ మూవీ గా పేరు తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు కోలీవుడ్ లోకీ వెళ్ళనుందట. ఈ సినిమాని తమిళనాట రీమేక్ చేయనున్నారు.

తెలుగులో వివాదాలతో మంచి హైప్ క్రియేట్ అవ్వటంతో ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు పోటి పడ్డాయి. అయితే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు చెందిన వుండర్‌ బార్‌ ఫిల్మ్స్‌ ఈ రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తారా..లేదా.. దర్శకుడు ఎవరు..? అన్న విషయాలు మాత్రం వెల్లడించలేదు.

 Dhanush to do "Arjun Reddy" Tamil remake

ఇప్పటికే వివాదాలు కొనసాగుతున్నా.. ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి మాత్రం అర్జున్ రెడ్డి పై ప్రశంసల జల్లు కురుస్తోంది. రాజమౌళి, మహేష్ బాబు లాంటి టాప్ స్టార్స్ కూడా అర్జున్ రెడ్డి టీం ను అభినందించటంతో సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. ఇప్పటికే ఓవర్ సీస్ లో మిలియన్ మార్క్ ను దాటేసిన ఈ సినిమా సరికొత్త రికార్డ్ ల దిశగా దూసుకుపోతోంది.

సినిమా ప్రమోసహన్ కోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు టీమ్. అందులో భాగం గానే నిన్న పాలమూరు లోనూ అర్జున్ రెడ్డి టీం సందడి చేసింది. స్థానిక ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్ లో విజయ్ దేవరకొండ వాలీబాల్ ఆడి అక్కడ మెడికోలతో చిట్ చాట్ లో పాల్గొన్నాడు.

English summary
The latest buzz in Kollywood and Tollywood is that Dhanush’s Wunderbar Films is in talks with the producers of Arjun Reddy to snap the Tamil remake rights of the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu