»   » ధనుష్, సౌందర్యకు చేదు అనుభవం.. మీడియా చుక్కలు.. వెంటాడిన సుచీ లీక్స్

ధనుష్, సౌందర్యకు చేదు అనుభవం.. మీడియా చుక్కలు.. వెంటాడిన సుచీ లీక్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  సుచీ లీక్స్ వ్యవహారం విలక్షణ నటుడు ధనుష్‌కు నిద్ర లేకుండా చేస్తున్నది. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అయిన సింగర్ సుచిత్ర వ్యవహారం సద్దుమణిగినందనుకుంటున్న నేపథ్యంలో మరోసారి తెలుగు మీడియాలో చర్చనీయాంశమైంది. తాజా వీఐపీ2 ప్రమోషన్‌కు వచ్చిన ధనుష్, దర్శకురాలు సౌందర్య తెలుగు మీడియా నుంచి చేదు అనుభవం ఎదురైనట్టు తెలుస్తున్నది. వీఐపీ చిత్ర వివరాలు అడుగుతూనే సుచీ లీక్స్ వ్యవహారం గురించి అడగడంతో ధనుష్ ఇబ్బంది పడినట్టు సమాచారం. అలాగే వీఐపీ దర్శకురాలు సౌందర్యను ఆమె దాంపత్య జీవితం వైఫల్యం గురించి అడగడంతో ఆమె కూడా కొంత మనస్తాపానికి గురైనట్టు తెలుస్తున్నది.

  నచ్చని ప్రశ్నలు ఎక్కువగా..

  నచ్చని ప్రశ్నలు ఎక్కువగా..

  గత శనివారం వీఐపీ2 ప్రమోషన్‌ కోసం హీరో ధనుష్, బాలీవుడ్ నటి కాజోల్, దర్శకురాలు సౌందర్య హైదరాబాద్‌కు వచ్చారు. పలు ప్రముఖ పత్రికలకు, టెలివిజన్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి నచ్చని ప్రశ్నలు ఎక్కువగానే వేసినట్టు.. అందుకు వారు ఇబ్బందికి గురైనట్టు తెలిసింది. ప్రధానంగా సంచలనం రేపిన సుచీలీక్స్, సౌందర్య డైవోర్స్ విషయంపై ఈ పర్యటనలో వారికి సమస్యగా మారినట్టు సమాచారం.

  Dhanush And Kajol Speech @ VIP 2 Team Press Meet
  మైక్‌ను విసురగొట్టి..

  మైక్‌ను విసురగొట్టి..

  తెలుగు ప్రముఖ టీవీ ఛానెల్‌కు సంబంధించిన ప్రోమోలో ధనుష్ మైక్ తీసి విసిరి కొట్టడం మీడియాలో చర్చనీయాంశమైంది. యాంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రోమోలో స్పష్టంగా కనిపించింది. అంతేకాకుండా చెత్త ఇంటర్వ్యూ అని కోపంతో సీట్లో నుంచి ధనుష్ వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. అయితే నిజంగానే ఆ సీన్ జరిగిందా? లేక సెన్సేషనల్ కోసం అలా చేశారా అనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ రేపుతున్నది.

  నో కామెంట్ అని సౌందర్య

  నో కామెంట్ అని సౌందర్య

  వీఐపీ2 సినిమా దర్శకురాలు సౌందర్య ఇటీవల తన భర్త నుంచి అధికారికంగా విడాకులు పొందారు. చెన్నైలోని ఓ ఫ్యామిలీ కోర్టు ఆమెకు డైవోర్స్ మంజూరు చేసింది. అయితే తన విడాకుల అంశాన్ని ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించగా అందుకు సమాధానం చెప్పడానికి ఆమె ‘నో కామెంట్' అని సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. అయితే తాను ఇప్పుడు ప్రస్తుతం హ్యాపీగా ఉన్నాను అనే సమాధానంతో ఆమె ఆ అంశాన్ని ముగించినట్టు తెలుస్తున్నది.

  హడావిడిగా ముగించిన కార్యక్రమం

  హడావిడిగా ముగించిన కార్యక్రమం

  శనివారం సాయంత్రం జరిగిన ట్రైలర్ ఆవిష్కరణ, స్పెషల్ సాంగ్ రిలీజ్ సందర్భంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 7 గంటలకు ప్రారంభం కావాల్సిన కార్యక్రమం 8.30 గంటలకు మొదలైంది. కేవలం పది, పదిహేను నిమిషాల్లోనే కార్యక్రమాన్ని హడావిడిగా ముగించారు. ముందుగా చెప్పిన ప్రకారం ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది అని చెప్పి అలాంటి ఏమీ లేకుండానే దానిని ముగించడంతో జర్నలిస్టులు అసంతృప్తికి గురైనట్టు తెలుస్తున్నది.

  సుచీ లీక్స్ భయంతోనే..

  సుచీ లీక్స్ భయంతోనే..

  సుచీ లీక్స్, ఇతర విషయాల గురించి ఏమైనా ప్రశ్నలు అడుగుతారా అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రశ్నోత్తర కార్యక్రమాల అంశాన్ని తొలగించారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అంతేకాకుండా భారీగా బౌన్సర్లను పెట్టి జర్నలిస్టులను దూరంగా పెట్టడం గమనార్హం. ఏదిఏమైనా సినిమా ప్రమోషన్‌ కోసం జోష్‌లో వచ్చిన వారికి ఇలాంటి చేదు అనుభవం ఎదురవ్వడం నిజంగా బాధాకరమే అనే మాట వినిపిస్తున్నది.

  English summary
  Dhanush had to deal with a slew of controversies related to his personal life in the last few months. His off-screen life came under media scrutiny after several controversial posts were leaked on south Indian playback singer and RJ Suchitra's Twitter page. In this juncture, Dhanush , Director Soundarya visited hyderabad for VIP2 promotion. They were faced negitive questions from media.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more