మరో తెలుగు సినిమా ఒప్పుకున్న ధనుష్.. ఈ సారి డైరెక్టర్ ఎవరంటే?
తమిళ స్టార్ హీరో ధనుష్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఒక ట్రై లింగ్యువల్ మూవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ధనుష్ మరో తెలుగు సినిమా ఒప్పుకున్నట్లే అని ప్రచారం జరుగుతోంది. ఆ దర్శకుడు ఎవరు అనే విషయం వెలుగులోకి రాకపోయినా తెలుగులో లవ్ స్టోరీస్ తెరకెక్కించి మంచి పేరు తెచ్చుకున్న ఒక కుర్ర దర్శకుడు అని అంటున్నారు.
ఒకవేళ ఈ ప్రాజెక్టు గనుక ఓకే అయితే దీని తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక ఈ ప్రాజెక్టు తనకు ఓకే అయితే తెలుగులో ఉన్న ఒక బడా ప్రొడక్షన్ సంస్థ నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ధనుష్ కి తమిళ్ లో ఉన్న మార్కెట్ తో పాటు దర్శకుడికి, ప్రొడక్షన్ హౌస్ కి తెలుగులో ఉన్న మార్కెట్ తోడైతేకచ్చితంగా ఇది ఒక మంచి వెంచర్ అవుతుందని ప్రొడక్షన్ సంస్థ భావిస్తున్నట్లు సమాచారం.

మరి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పటికి వెలువడుతున్న వేచిచూడాల్సి ఉంది. మరోపక్క ఇప్పటికే తెలుగు, తమిళ హిందీ భాషలతో పాటు హాలీవుడ్లో కూడా బిజీగా ఉన్న ధనుష్ ఇలా వరుస సినిమాలు ఒప్పుకోవడం ఆసక్తి రేపుతోంది. ధనుష్ చివరిగా జగమే తంత్రం అనే సినిమాలో కనిపించారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కొద్ది రోజుల క్రితం ఆన్ లైన్ వేదికగా సుమారు 17 భాషల్లో 190 దేశాలలో రిలీజ్ అయింది.. అయితే ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయినా సరే ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ ధనుష్ క్రేజ్ తో సినిమాకి మంచి వ్యూస్ దక్కుతున్నా ఈసారి తెరకెక్కించబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఫిక్సయ్యారు ధనుష్.


Click it and Unblock the Notifications











