»   » ‘ధృవ’ వీడియో సాంగ్స్ వచ్చేసాయ్... మరో వైపు చెర్రీని పవన్ కాదన్నాడంటూ రూమర్స్!

‘ధృవ’ వీడియో సాంగ్స్ వచ్చేసాయ్... మరో వైపు చెర్రీని పవన్ కాదన్నాడంటూ రూమర్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో, స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రెస్టిజియ‌స్ మూవీ ధృవ ఈ స్టైలిష్ క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.

ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌, మ‌రో నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని హై బ‌డ్జెట్‌, టెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. ఇప్పుడు హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్ షూటింగ్ హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతుంది. సినిమా చిత్రీక‌ర‌ణ‌తో పాటు స‌మాంత‌రంగా సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రంలో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌న‌పించ‌నున్నారు. సినిమా ఫ‌స్ట్ లుక్ నుండి ఆడియెన్స్‌లో క్రేజ్ నెల‌కొంది. ఈ సినిమాకు హిప్ హాప్ ఆది సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పాట‌ల‌ను ఆదిత్య మ్యూజిక్ ద్వారా న‌వంబ‌ర్ 9న నేరుగా మార్కెట్లోకి విడుద‌ల చేస్తున్నారు.

తాజాగా సినిమాకు సంబంధించిన కొన్ని వీడియో సాంగ్ టీజర్లు రీలీజ్ చేసారు....

rn

నీతోనే డాన్స్... సాంగ్ టీజర్

రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ లపై చిత్రీకరించిన నీతోనే డాన్స్.... అనే వీడియో సాంగ్ టీజర్ రిలీజ్ చేసారు. ఇందులో చెర్రీ డాన్స్ ఓ రేంజిలో ఉండబోతోంది. త్వరలో పూర్తి సాంగ్ ను విడుదల చేయబోతున్నారు.

rn

చూసా చూసా చూసా... సాంగ్ టీజర్

రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ లపై చిత్రీకరించిన చూసా చూసా చూసా ... అనే వీడియో సాంగ్ టీజర్ రిలీజ్ చేసారు. ఫుల్ రొమాంటిక్ గా ఈ సాంగ్ టీజర్ ఉండబోతోంది.

ఆడియో రిలీజ్ బదులు, ప్రీ రిలీజ్ ఫంక్షన్

ఆడియో రిలీజ్ బదులు, ప్రీ రిలీజ్ ఫంక్షన్

ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరుపటం లేదు కాబట్టి ..సినిమా విడుద‌ల‌కు ముందు అభిమానులు, ప్రేక్ష‌కుల న‌డుమ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను నిర్వ‌హించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

డిసెంబర్లో విడుదల

డిసెంబర్లో విడుదల

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ మొదటి వారం లో సినిమా విడుదల అవుతుంది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ మొదటి వారం లో సినిమా విడుదల అవుతుంది.

పవన్ కళ్యాణ్, చెర్రీలపై రూమర్

పవన్ కళ్యాణ్, చెర్రీలపై రూమర్

ధృవ ఆడియో ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా పవన్‌ను తీసుకురావాలనుకున్నాడు చెర్రీ. కానీ, పవన్ నుంచి కనీస స్పందన లేక పోవడంతో ఆడియో వేడుక కాన్సిల్ చేసాడట. మరోవైపు, కమెడియన్ సప్తగిరి నటించిన సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సినిమా ఆడియో ఫంక్షన్‌కు పవన్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడని, కమెడియన్ సినిమా ఫంక్షన్‌కు వచ్చి తన సినిమా ఫంక్షన్‌కు రాకపోతే అది తనకు అవమానమే అని భావించిన చెర్రీ ఏకంగా ధృవ ఆడియో ఫంక్షన్‌నే రద్దు చేశాడని టాలీవుడ్లో రూమర్ హల్ చల్ చేస్తోంది.

నటీనటులు, టెక్నీషియన్స్

నటీనటులు, టెక్నీషియన్స్

రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు న‌టించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌- పి.య‌స్‌.వినోద్‌, మ్యూజిక్ - హిప్ హాప్ ఆది, ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్, ఆర్ట్ - నాగేంద్ర, ఎడిటర్ - నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.వై. ప్రవీణ్ కుమార్, ప్రొడ్యూసర్స్ - అల్లు అరవింద్, ఎన్‌.వి.ప్ర‌సాద్‌, దర్శకుడు - సురేందర్ రెడ్డి.

English summary
Dhruva Telugu Movie Songs. Choosa Choosa Song Teaser. Dhruva Latest 2016 movie ft. Ram Charan, Rakul Preet and Aravind Swamy. Directed by Surender Reddy and music by Hiphop Tamizha. Produced by Allu Aravind on Geetha Arts Banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu