»   » తెల్ల తోలు ఉందని... : 'సరైనోడు' టీజర్ డైలాగు లీక్

తెల్ల తోలు ఉందని... : 'సరైనోడు' టీజర్ డైలాగు లీక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న నూతన చిత్రం 'సరైనోడు'. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, కేథరిన్‌ హీరోయిన్స్. ఈ చిత్ర టీజర్‌ను ఈ రోజున (పిభ్రవరి 18న )విడుదల చేయనున్నారు. ఈ టీసర్ కు సంబందించిన డైలగ్ ఒకటి లీక్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే

"తెల్ల తోలు ఉందని క్లాసు అనుకుంటున్నావేమో...మాస్, పక్కా మాస్"


ఇంతకీ ఈ డైలాగు ఉందో లేక ఫ్యాన్స్ క్రియేట్ చేసిందో తెలియాలంటే మరి కొద్ది గంటలు ఆగాల్సిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేస్తున్న 'సరైనోడు' తుది మెరుగులు దిద్దుకుంటోంది.


పార్టీల్లో, గేదరింగ్ లలో చరణ్, చిరు, బన్ని ఇలా...(రేర్ ఫోటోలు)


అల్లు అర్జున్‌ స్టైల్‌, బోయపాటి శ్రీను టేకింగ్‌ కలగలిపిన చిత్రమంటే అభిమానుల్లో అంచనాలు ఏవిధంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ చూస్తే సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.


Dialogue in Allu Arjun 'Sarrainodu' teaser

అంజలి ఓ స్పెషల్ సాంగ ్లో కనిపించనుంది. గీతా ఆర్ట్స్‌ సంస్థ తెరకెక్కిస్తోంది. ఇక ఏపీ, తెలంగాణ, బెంగుళూరు ఏరియాల్లో ఉన్న దాదాపు 1000 థియేటర్లలో ఈ టీజర్ ప్రదర్శించబోతున్నారు.


నిర్మాత మాట్లాడుతూ...''బన్నీ లుక్‌ సరికొత్తగా ఉంటుందీ చిత్రంలో. తన సినిమా అంటే స్టైల్‌, డ్యాన్స్‌ ఉండాల్సిందే. బోయపాటి సినిమా అంటే యాక్షన్‌ సన్నివేశాల్ని ఆశిస్తారు. అవన్నీ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన తొలి ప్రచార చిత్రానికి మంచి స్పందన వచ్చింది. తమన్‌ బాణీలు ఆకట్టుకొంటాయి''అని చెప్పారు.


పవన్,మహేష్,ఎన్టీఆర్ ల గురించి సమంత (ఫొటో ఫీచర్)


సరైనోడు షూటింగ్ విశేషాలు...


‘సరైనోడు' చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. తాజాగా సినిమాకు సంబంధించిన స్పెషల్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగు కోసం రూ. కోటిన్నర విలువ చేసే సెట్ వేసారు. ‘అల్లు అర్జున్, కేథరిన్ లపై ఈ స్పెషల్ సాంగ్ చిత్రీరిస్తున్నారు.


ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియోస్ లోని 7 ఎకరాల స్థలంలో రూ. కోటిన్నర ఖర్చు పెట్టి సెట్ వేసారు. ఈ సాంగులో దాదాపు 300 మంది డాన్సర్లు బ్యాగ్రౌండ్లో స్టెప్పులేస్తున్నారు. మరో మూడు రోజుల్లో సాంగ్ చిత్రీకరణ పూర్తి కాబోతోంది' అని యూనిట్ సభ్యులు తెలిపారు.


టాలీవుడ్లో హయ్యెస్ట్ రెమ్యూరేషన్ తీసకునే హీరో ఎవరు?


పాపులర్ బాలీవుడ్ కొరియోగ్రఫీ ద్వయం బాస్కో-కాసెర్ ఆధ్వర్యంలో సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ సాంగ్ చిత్రీకరణలో అత్యంత ఖరీదైన లాంబోర్గినీ కార్లను కూడుతున్నారు. ఇందుకోసం వాటిని ప్రత్యేకంగా రెంటుకు తెప్పించారు. సాంగ్ చాలా బాగా వస్తోందని, సినిమాలో ఇది హైలెట్ అవుతుందని అంటున్నారు.


బన్నీ సొంత బేనర్లో... ఆయన తండ్రి అల్లు అరవింద్ నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్‌ జన్మదినం సందర్భగా ఏప్రిల్‌ 8న చిత్రాన్ని విడుదల చేసేందుకుసన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్‌తో కూడిన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీకాంత్‌, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

English summary
As the teaser of "Sarrainodu" is going to be released today at 2 PM, a rumour started doing rounds about the dialogue featuring in this teaser now. Wait for tomorrow, to find out if this is true or not. Directed by Boyapati Sreenu, Sarrainodu has Allu Arjun, Rakul Preet and Catherine Tresa in the leads.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu