»   » వరదలు దెబ్బ...తమన్ వర్క్ మణిశర్మ కి

వరదలు దెబ్బ...తమన్ వర్క్ మణిశర్మ కి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 99వ సినిమా ని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ 'డిక్టేటర్' ని నిర్మిస్తోంది. దీనికి సంగీత దర్శకుడిగా తమన్ ని ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తమన్ ప్లేస్ లోకి మణిశర్మ చేరబోతున్నట్లు సమాచారం. అయితే సినిమాలో పాటలు కు కాదు. మణిశర్మ స్పెషాలిటి అయిన రీరికార్డింగ్ కోస అని తెలుస్తోంది.

మెన్నటి చెన్నై వరదలు, సిటితో పాటుగా తమన్ కి కూడా చాల నష్టం కలిగించింది. పాపం తన స్టూడియో మెత్తం పాడైపోయింది. నెక్స్ట్ మంత్ రిలీజ్ కి సిద్దమవుతున్నా 'డిక్టేటర్' కి రీ రికార్డింగ్ అగిపోయింది. అందువల్ల శ్రీవాస్ ని కలిసి సినిమా సంక్రాంతికి విడుదల చేయ్యలంటే మీరు రీరికార్డ్ంగ్ మణిశర్మ గారితో చేయించమని అడిగారని సమాచారం..

బాలకృష్ణ మాట్లాడుతూ ....కుటుంబ బంధాలు, యాక్షన్, వినోదం అన్ని సమపాళ్లలో మేళవించిన చిత్రమిది. కోన వెంకట్, గోపీమోహన్ చక్కటి కథను అందించారు. కొత్త టీమ్‌తో పనిచేయటం ఆనందంగా ఉంది .దర్శకుడు శ్రీవాస్ చెప్పిన కథలో కొత్తదనం ఉండడంతో చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నానని, కోన వెంకట్, గోపీ మోహన్, రత్నం, శ్రీధర్ సీపానలు ఈ చిత్రంకోసం పనిచేస్తున్నారని, యాక్షన్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ లాంటి అన్ని ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం రూపొందుతుందని తెలిపారు.

Dictator shift from thaman to mani sharma

ప్రేక్షకులు, అభిమానులు బాలకృష్ణను ఎలా చూడాలనుకుంటారో అలా ఈ చిత్రం రూపొందనుందని ఈరోస్ సునీల్‌లుల్లా తెలిపారు. యాక్షన్ ఎమోషనల్ డ్రామా అంశాలతో రూపొందే డిక్టేటర్ ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుందని, ఇప్పటివరకు బాలయ్యను చూడని విధంగా వైవిధ్యంగా ఈ చిత్రంలో చూపనున్నామని దర్శకుడు శ్రీవాస్ తెలిపారు. అలాగే...శ్రీవాస్ మాట్లాడుతూ బాలకృష్ణను సరికొత్త పంథాలో ఆవిష్కరిస్తున్న చిత్రమిది.

నందమూరి బాలకృష్ణ, అంజలి, నాజర్, బ్రహ్మానందం, రవి కిషన్, కబీర్, వెన్నెల కిషోర్, పృథ్వి, కాశీ విశ్వనాథ్, ఆనంద్, సుప్రీత్ అమిత్ తదితరులు నటిస్తున్నారు. ప్రొడ్యూసర్: ఏరోస్ ఇంటర్నేషనల్, కోప్రొడ్యూసర్: వేదాశ్వ క్రియేషన్స్, డైరెక్టర్: శ్రీవాస్, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, మాటలు: ఎం. రత్నం, రచన: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, మ్యూజిక్: థమన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, ఫైట్స్: రవివర్మ, స్టిల్స్: అన్బు, పి.ఆర్.ఓ: వంశీ శేఖర్.

English summary
Thaman asked director Srivaas if he wants the film to release during Sankranthi it is better to complete rerecording with Manisharma.
Please Wait while comments are loading...