»   » బ్యాంకాక్ లో రకుల్ బిజినెస్ మొదలెట్టిందా .. నిజమేనా..? ఇదిగో సాక్ష్యం

బ్యాంకాక్ లో రకుల్ బిజినెస్ మొదలెట్టిందా .. నిజమేనా..? ఇదిగో సాక్ష్యం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హీరోలు,హీరోయిన్స్ బిజినెస్ చేయటం కొత్త లేదా వింత విషయమేమీ కాదు. తాము కష్టపడి సంపాదించుకున్న డబ్బుని తెలివిగా ఇన్వెస్ట్ చేస్తూ దాన్ని పెంచుతూంటారు. ఆ తరం హీరోయిన్స్ సంగతేమో కానీ ఈ తరంలో హీరోయిన్స్ అంతా తమదైన శైలిలో తమకు తెలిసిన వ్యాపారాల్లో , లేదా ప్రోపర్టీస్ లో పెట్టుబడి పెడుతున్నారు. అందులో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రకుల్ ప్రీతి సింగ్ ఒకరు.

వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంటూ ఏ ఆఫర్ కూడా మిస్ కాకుండా ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా డేట్స్ ఎడ్జెస్ట్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ని ఎవరు అడిగినా క్షణం తీరిక లేదనే విషయం ఇట్టే చెప్పేస్తారు. ముఖ్యంగా స్టార్ హీరోల సరసన క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తుండటంతో.. రకుల్ పూర్తి బిజి షెడ్యూల్స్ తో ఉంటోంది. ఇలాంటి టైట్ షెడ్యూల్ సమయంలో కూడా తన బిజినెస్ లపైనే దృష్టిపెడుతోంది రకుల్.

Did Rakul started business in Bangkok?

ఇప్పటికే హైదరాబాద్ కు షిప్ట్ అయిన రకుల్.. ఇక్కడ ఎఫ్ 45 అనే బ్రాండ్ కు చెందిన గచ్చిబౌలి ఫ్రాంచైజీ జిమ్ ను రకుల్ నడిపిస్తోంది. దీనిని రకుల్ సోదరుడు చూసుకుంటున్నాడు. ఇది కాకుండా జూబ్లీహిల్స్ లో కూడా ఓ ఎఫ్ 45 జిమ్ కూడా ఉంది కానీ.. అది వేరేవాళ్లు రన్ చేస్తున్నారని తెలుస్తోంది.

అయితే తాజాగా ఓ సినిమా షూట్ కోసం బ్యాంకాక్ వెళ్లిన రకుల్.. అక్కడ కూడా ఎఫ్ 45 జిమ్ కి వెళ్లి వర్కవుట్స్ చేస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చి వార్తలు కు ఎక్కింది. అంతేకాకుండా ఆ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. నచ్చిన పని చేయడానికి టైమ్ ఎప్పుడూ దొరుకుతుంది, బ్యాంకాక్ లోని ఎఫ్ 45 లో వర్కౌట్స్ చేస్తున్నా అంటూ ట్వీట్ చేసింది. దాంతో ఇప్పుడు సినీ సర్కిల్ లో ఇంట్రెస్టింగ్ మేటర్ కు తెర తీసింది.

బ్యాంకాక్ ఎఫ్ 45 ని రకుల్ ప్రమోట్ చేయడం చూస్తుంటే.. ఆ ఫ్రాంచైజీ కూడా ఆమెదేనని అర్థమైపోతుంది అంటూ సినీవర్గాలు చెప్పేస్తున్నాయి. అలాగే రకుల్ చేస్తోంది బ్రాండ్ ప్రమోషన్ కాదని, తన సొంత జిమ్ కాబట్టే బ్యాంకాక్ నుంచి ఎఫ్ 45 కి ప్రచారం చేస్తోందని ఇన్నర్ సర్కిల్ లో ప్రచారం జరుగుతోంది. మరి నిజంగానే బ్యాంకాక్ లో కూడా రకుల్ బిజినెస్ స్టార్ట్ చేసిందా అనే విషయం.. రకుల్ స్వయంగా చెప్తే కానీ తెలియదు.

English summary
Rakul has started the business at Bangkok too as she's hitting the same gym. Looking at the way Rakul is promoting the Bangkok branch, it seems like she owns that too.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu