twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'దిక్కులు చూడకు ..' దర్శకుడు నెక్ట్స్ ఖరారు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రాజమౌళి క్యాంప్ నుంచి వచ్చిన మరో దర్శకుడు త్రికోటి. రాజమౌళి శిష్యులంతా ఇప్పటివరకూ వచ్చిన వారు సరైన హిట్ ఇవ్వలేకోపోయారు. అయితే త్రికోటి తన సినిమాకు పెద్ద హిట్ అనిపించుకోలేకపోయినా బ్యాడ్ అని మాత్రం అనిపించుకేలేదు. 'దిక్కులు చూడకు రామయ్య' చూసిన వారు ఫరవాలేదు ..ఫస్టాఫ్ కామెడీ బాగానే ఉంది. సెకండాఫ్ లో క్లైమాక్స్ కూడా బాగా తీసాడు అని అని టాక్ వచ్చింది. దాంతో ఆయనకు రెండో చిత్రం వచ్చిందని సమాచారం. అదే బ్యానర్ లో ఆయన తన తదుపరి చిత్రం చేస్తారని తెలుస్తోంది. ఆ చిత్రం నాగ చైతన్య తో కావచ్చునని ఫిల్మ్ నగర్ టాక్. అయితే నాగార్జునకు గతంలో ఆయన ఓ కథ చెప్పి,వర్క్ చేసారని, అది వర్కవుట్ కాలేదని,ఇప్పుడు ఈ చిత్రంతో ప్రూవ్ చేసుకోవటంతో నాగచైతన్య ఆసక్తి చూపుతున్నట్లు చెప్పుకంటున్నారు.

    తప్పటడుగేసిన తండ్రిని దారిలో పెట్టేందుకు తనయుడేం చేశాడనే కథతో 'దిక్కులు చూడకు రామయ్య' చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో అజయ్, నాగశౌర్య తండ్రి కొడుకులు గా కనిపిస్తారు. అజయ్ వయస్సు 40 సంవత్సరాలు ఉంటుంది. తండ్రి,కొడుకులు ఇద్దరూ ఒకే అమ్మాయితో ప్రేమలో పడటమనే విభిన్నమైన కాన్సెప్టుతో వచ్చిన ఈ చిత్రం భాక్సాపీస్ వద్ద కథగా బాగానే గెలిచింది.

    ఇక నాగ చైతన్య విషయానికి వస్తే ...ఆయన తాజా చిత్రం ‘ఒక లైలా కోసం' రేపు విడుదల అవుతోంది. ఈ చిత్రానికి విజయ్‌కుమార్‌ కొండా దర్శకత్వం వహించారు. నాగార్జున నిర్మాత. పూజాహెగ్డే హీరోయిన్.

    Dikkulu Choodaku Ramayya director Trikoti teams up with Chaitu

    దర్శకుడు మాట్లాడుతూ ‘‘రొమాంటిక్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. కాలేజీ చదువు పూర్తి చేసి కన్‌ఫ్యూజన్‌లో ఉండే కార్త్తీక్‌ పాత్రలో నాగచైతన్య కనిపిస్తాడు. స్వేచ్ఛను ప్రేమించే కార్తీక్‌ ఓ సందర్భంలో నందనను కలుస్తాడు. ఆమెని ప్రేమిస్తాడు. కానీ ఆమె అతన్ని ఇష్టపడదు. అయినా అనుకోని పరిస్థితుల్లో కార్తీక్‌ను పెళ్లిచేసుకోవాల్సి వస్తుంది. ఇంతకీ కార్తీక్‌ ఆమె ప్రేమను గెలుచుకున్నాడా.. లేదా? అనేది ఆసక్తికరం. వైవిధ్యమైన ఇతివృత్తంతో సాగే సినిమా ఇది. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది. చైతూ, పూజా తమ పాత్రలకు న్యాయం చేశారు.''అని తెలిపారు.

    నిర్మాత మాట్లాడుతూ... ''ప్రేమకు రీజన్స్‌ ఉండవు. ఓన్లీ ఎమోషన్స్‌' అని నమ్మే యువకుడు. ప్రేమంటే ఆమడ దూరం ఉండే అమ్మాయి. తీపి, పులుపు లాంటి వీరి మధ్య విజయ్‌కుమార్‌ కొండా శైలిలో తెరకెక్కిన ప్రేమకథ ఇది. నేటి యువత మనసులు, ప్రేమలను తెరపై ఆవిష్కరిస్తున్నాం. త్వరలో పాటలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ'' అంటున్నారు నిర్మాత.

    అలీ, సాయాజీ షిండే, రోహిణి, సుమన్‌, సుధ, చలపతిరావు, ఎం.ఎస్‌.నారాయణ, అన్నపూర్ణ, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిశోర్‌, శుభలేఖ సుధాకర్‌, భరత్‌రెడ్డి తదితరులు ఇతర పాత్రఽధారులు. ఈ సినిమాకు కెమెరా: ఐ.ఆండ్రూ, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, విజయ్‌, నిర్మాత: అక్కినేని నాగార్జున, దర్శకత్వం: విజయ్‌కుమార్‌ కొండా.

    English summary
    Nagaruna asked Trikoti to direct his son Naga Chaitanya.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X