ఫేక్ ఎక్కౌంట్ సమస్యలో దిల్ రాజు
అసలే ఓ ప్రక్క సినిమాలు వరసగా ఫెయిల్యూర్ అవుతూ టెన్షన్ లో ఉన్న దిల్ రాజుకి ఓ కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఆయన పేరు మీద ఓ ఫేక్ ఎక్కౌంట్ ఒకటి ట్విట్టర్ లో ఓపెన్ చేసారు. దిల్ రాజుకు అస్సలు సంభందంలేని ఆ ఎక్కౌంట్ లో ఆయన పేరు మీద ఏ విషయాలు చెలామణి అవుతాయో అని భయపడుతున్నారని తెలుస్తోంది. ఇక దగ్గుపాటి రానా ఈ ఫేక్ ఎక్కౌంట్ విషయాన్ని తన ట్విట్టర్ లో తెలియచేస్తూ...దాన్ని దిల్ రాజు అనుకుని ఫాలో కావద్దని చెప్పారు. ఆ మధ్య త్రిషకు కూడూ ఇలాంటి ఫేక్ ఎక్కౌంట్ సమస్య ఎదురైన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక దిల్ రాజు ప్రస్తుతం ఎన్టీఆర్ తో బృందావనం, ప్రభాస్-దశరధ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందిస్తున్నారు. రీసెంట్ గా ఆయన బ్యానర్ నుండి వచ్చిన రామ రామ కృష్ణ కృష్ణ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
దిల్ రాజు రామ రామ కృష్ణ కృష్ణ బృందావనం ప్రభాస్ dil raju brindavanam prabhas rama rama krishna krishna


Click it and Unblock the Notifications