twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దిల్ రాజు తప్పు చేశారా?: చేజేతులా.., నాని కోసం సాయిపల్లవికి అన్యాయం!

    |

    తెరపై హీరో ఒక్కడే అద్భుతమనిపించాలి. అతని ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకునే కథ రాసుకోవాలి. ఎక్కడా.. ఏ క్యారెక్టర్ హీరోను డామినేట్ చేయొద్దు. ఇక హీరోయిన్ పాత్ర హీరో ముందు బెండ్ అవాల్సిందే తప్పితే.. తనను మించి ఫోకస్ లోకి రావద్దు.

    తెలుగు హీరోలకు కథలు రాయాలంటే.. సబ్జెక్ట్ కన్నా ఈ నిబంధనలను ఎక్కువగా మైండ్‌లో పెట్టుకోవాలి. ఇంత చేసినా.. ఒకవేళ తమ నటనతో ఎవరైనా హీరోను డామినేట్ చేస్తే.. నిర్దాక్షిణ్యంగా ఆ సీన్స్ పీకి పారేయాల్సిందే!. తాజాగా విడుదలైన ఎంసీఏ సినిమా విషయంలోనూ ఇదే జరిగిందట.

     ఫిలింనగర్ టాక్:

    ఫిలింనగర్ టాక్:

    అనుకున్నదే జరిగింది.. అందుకే ఆ నాలుగు సీన్స్ లేపేశారట. ఎంసీఏ సినిమాకు సంబంధించి ఇప్పుడిదే చర్చ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. నిజానికి ఆ నాలుగు సీన్లు కట్ చేసి ఉండకపోతే.. సినిమా రిజల్ట్ కూడా మరోలా ఉండేదన్న అభిప్రాయలు వ్యక్తమవుతుండటం గమనార్హం.

     నాని కోసం:

    నాని కోసం:

    కేవలం నాని ఇమేజ్‌ను కాపాడటం కోసం.. ఎంసీఏలో సాయి పల్లవి సీన్స్‌ను పణంగా పెట్టారన్న వాదన వినిపిస్తోంది. తీరా ఇప్పుడు చేతులు కాలేసరికి.. హయ్యో ఎంత పనిచేశాం అనుకుంటున్నారట. సినిమా నుంచి తొలగించిన సాయి పల్లవి సీన్స్ విషయంలో నిర్మాత దిల్ రాజు అంతర్మథనంలో పడ్డారట.

     ఏంటా సీన్స్:

    ఏంటా సీన్స్:

    నిజానికి భూమిక-నాని మధ్య జరిగే సన్నివేశాలు ఎంసీఏ సినిమాకు హైలైట్ అవుతాయని భావించారట. అదీ గాక.. సినిమాలోని నాలుగు రొమాంటిక్ సీన్లలో నానిని సాయిపల్లవి డామినేట్ చేసిందట. ఆ సీన్స్ సినిమాలో ఉంచితే అసలు కాన్సెప్ట్ పక్కకు వెళ్లడమే కాకుండా.. నాని ఇమేజ్ ఎక్కడ దెబ్బతింటుందోనని కత్తెరకు పని చెప్పారట.

     పునరాలోచనలో దిల్ రాజు?:

    పునరాలోచనలో దిల్ రాజు?:

    సాయిపల్లవి సీన్స్‌కు కత్తెర చెప్పిన దిల్ రాజు.. ఎంసీఏ సినిమా రిజల్ట్ తర్వాత పునరాలోచనలో పడ్డారట. సాయి పల్లవి సీన్స్ అలాగే ఉంచి ఉంటే ఫలితం మరోలా ఉండేదని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో.. తిరిగి ఆ కట్ చేసిన సీన్స్ యాడ్ చేస్తారా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

     దిల్ రాజు నిర్ణయం బెడిసికొట్టిందా?:

    దిల్ రాజు నిర్ణయం బెడిసికొట్టిందా?:

    ఫిదాలో తన సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన సాయిపల్లవిపై తెలుగు ఆడియెన్స్‌కు మంచి అంచనాలు ఏర్పడ్డాయి. స్క్రీన్‌పై ఆమె అభినయం, డ్యాన్సులను చూడటానికి వారు ఆసక్తి కనబరుస్తున్నారు.

    సినిమాలో సాయిపల్లవి ఉందంటే.. కచ్చితంగా ఆమె అభినయం కోసమే థియేటర్లకు వెళ్తున్నారు. అలాంటిది.. సాయి పల్లవి సీన్స్‌కే దిల్ రాజు ఎసరు పెట్టడం తప్పుడు నిర్ణయమేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

     దిల్ రాజు జడ్జ్‌మెంట్:

    దిల్ రాజు జడ్జ్‌మెంట్:

    సినిమాల్ని చూసి వాటి ఫలితాన్ని దిల్ రాజు పక్కాగా జడ్జ్‌మెంట్ చేయగలరన్న ఒక అభిప్రాయం ఉంది. అలాగే ఏ సీన్ ఎంతవరకు ఉండాలి.. ఏవి అవసరం?, ఏవి అనవసరం? వంటివి కూడా ఆయన బాగానే జడ్జ్ చేయగలరని చెబుతారు. మరి సాయి పల్లవి విషయంలో మాత్రం ఆయన జడ్జ్‌మెంట్ ఎందుకు బోల్తా కొట్టిందో!

    English summary
    Dil Raju is known for his editing room judgement and 90% of his judgements proved to be right.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X