»   » కమల్ హాసన్ కూతురు కోసం దిల్ రాజు ట్రైల్స్

కమల్ హాసన్ కూతురు కోసం దిల్ రాజు ట్రైల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మరో చరిత్ర చిత్రాన్ని రీమేక్ చేస్తున్న దిల్ రాజు తాజాగా హిందీలో కూడా దీన్ని రూపొందించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అప్పట్లో ఈ చిత్రం ఏక్ దూజే కేలియే పేరుతో కమల్,రతి అగ్నిహోత్రి కాంబినేషన్లో వచ్చింది. ఇక దిల్ రాజు ఈ చిత్రాన్ని హిందీలో చేయటానికి కమల్ మరో కుమార్తె అక్షర హాసన్ ని అడుగే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అక్షర తన తల్లి సారిక నటిస్తున్న ఓ చిత్రానికి అసెస్టెంట్ డైరక్టర్ గా చేస్తోంది. మరో ప్రక్క ఈ చిత్రాన్ని శృతిహాసన్ తో చేస్తారని,రతి అగ్నిహోత్రి కుమారుడు తనూజ్ హీరోగా చేయనున్నారని బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి. దీనిపై శృతి స్పందిస్తూ....నా దగ్గరకు ఎలాంటి ప్రపోజల్ రాలేదు. ఇక వచ్చినా నేను చెయ్యటానికి రెడీగా లేను. ఎందుకంటే నేను సూర్య సరసన మురగదాస్ చిత్రంలో చేస్తున్నాను. డేట్స్ మరో ఆరు నెలల వరకూ ఖాళీ లేవు. అయినా ముంబయిలోని నా ఇంటిని నేను సర్ధుకోవటానికే ఖాళీలేదు. అలాంటిది కొత్త ప్రాజెక్టు ఎలా ఒప్పుకుంటాను అని చెప్పుకొచ్చింది. ఏదైతేనేం హిందీలో మరో చరిత్ర చేయటం ఖాయమని తెలుస్తోంది. ఎవరు చేస్తారనేది భవిష్యత్ నిర్ణయిస్తుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu