»   »  రామ్ కు ట్విస్ట్ కు రీ ట్విస్ట్ ఇచ్చిన దిల్ రాజు?అనీల్ రావిపూడి పై ఎఫెక్ట్?

రామ్ కు ట్విస్ట్ కు రీ ట్విస్ట్ ఇచ్చిన దిల్ రాజు?అనీల్ రావిపూడి పై ఎఫెక్ట్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆ మధ్యన హీరో రామ్ తను తదుపరి చిత్రంలో బ్లైండ్ గా కనిపించబోతున్నానంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. పటాస్, సుప్రీమ్ చిత్ర్లాల దర్శకుడు అనీల్ రావిపూడి తో ముందుకు వెళ్తున్నా అన్నారు. అయితే ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న గుసగుసలను బట్టి ఈ ప్రాజెక్టు లేనట్లే అని తెలుస్తోంది. అందుకు కారణం దిల్ రాజు అంటున్నారు. అయితే పూర్తిగా కారణం దిల్ రాజు కూడా కాదని రామ్ అని వినపడుతోంది. సంతరించుకుంటోంది.

'నా 15వ సినిమాని అనిల్ రావిపూడితో చేస్తున్నానని చెప్పడానికి సంతోషిస్తున్నా. ఇది చాలా స్పెషల్ సినిమా. హీరో బ్లైండ్ అయినా మూవీ కమర్షియల్' అంటూ ఆ మధ్యన రామ్ ట్వీట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించబోతున్నట్లు తెలిసింది. అయితే రామ్ కు, దిల్ రాజు కు రెమ్యునేషన్ విషయంలో తేడాలు వచ్చినట్లు చెప్పుకుంటున్నారు.

Dil Raju Puts Ram’s Film On The Backburner!

రామ్ ...ఐదున్నర కోట్లు రెమ్యునేషన్ గా అడిగారని, అంత ఇవ్వటానికి దిల్ రాజు ఇష్టపడలేదని చెప్తున్నారు. సినిమా విషయంలో దిల్ రాజు ప్రతీ అడుగు జాగ్రత్తగా వేస్తూంటారు. అందుకే అంత సక్సెస్ రేటు ఉంటుంది ఆయనకు. అయితే గతంలోనూ రామ్ తో సినిమా చేసి డిజాస్టర్ కొట్టిన ఆయన ఈ సారి బడ్జెట్ ని కంట్రోలు లో పెట్టి హిట్ కొట్టాలనుకున్నారట. అనీల్ రావిపూడి కథ నచ్చిన ఆయన రామ్ కు కూడా ఆ కథ నచ్చటంతో నిర్మించటానికి ముందుకు వచ్చారుట.

అయితే రెమ్యునేషన్ దగ్గరే తేడా కొట్టిందని చెప్పుకుంటున్నారు. ఇంతకు ముందు కూడా రవితేజ సినిమాని కేవలం రెమ్యునేషన్ విషయంలో ఆపు చేసారని, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారని అంటున్నారు. అయితే అనీల్ రావిపూడి ఇప్పుడు వేరే హీరోతో ముందుకు వెళ్తారా. లేక వేరే నిర్మాతతో ముందుకు వెళ్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

అయితే అఫ్ కోర్స్ ఇందులో ఎంతవరకూ నిజముందని తెలియాల్సి ఉంది. కేవలం ఇది రూమర్ మాత్రమేనా లేక నిజంగానే ప్రాజెక్టు కాన్స్లి ల్ అయ్యిందా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాలి. ఎందుకంటే జెన్యూన్ నిర్మాత దిల్ రాజు. నిర్మాతను గౌరవించే హీరో రామ్ . కాబట్టి..ఈ వార్త ప్రాధాన్యత సంతరించుకుంటోంది.

English summary
If the hush whispers from the tinsel town are to be believed, Ram’s film with Anil Ravipudi has been called off. Sadly the project has now been put on the backburner by Dil Raju.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu