»   »  దిల్ రాజు కుమార్తె వివాహ తేదీ, పూర్తి వివరాలు

దిల్ రాజు కుమార్తె వివాహ తేదీ, పూర్తి వివరాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కథాబలం గల చిత్రాలను స్టార్స్ తో నిర్మించి సూపర్ హిట్స్ కొట్టే నిర్మాత దిల్ రాజు. ఆయన ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి వివాహం మే 2 న గ్రాండ్ గా జరుగబోతోంది. వరుడు పారిశ్రామిక వేత్త అర్చిత్ రెడ్డి. వివాహం బంధువర్గం సమక్షంలో ఊటీలో జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లు గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఏప్రియల్ 30న సంగీత్ జరగనుంది.

సంప్రదాయబద్దంగా వివాహం జరగనుంది. విందు,పెళ్లికి చెందిన ఏర్పాట్లు భారీ స్ధాయిలో చేస్తున్నారు. పూలుని విదేశాల నుంచి తెప్పిస్తున్నారు. వివాహానికి పెద్దగా సినీ సెలబ్రెటీలు హాజరు కారని తెలుస్తోంది. హైదరాబాద్ లో జరిగే రిసెప్షన్ కి సినిమా వారందరనీ ఆహ్వానించి చేస్తున్నట్లు సమాచారం. ఆ మధ్య ఆయన సొంతూరైన నిజామాబాద్‌లో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.

 Dil Raju's Daughter Marriage Details

దిల్ రాజు ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ...ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. ఈ వేడుకని వాళ్లు ప్రెవేట్ గా చేసుకోవాలనకుంటున్నారు. దాన్ని పబ్లిక్ చేయవద్దు అన్నారు. ఇక హైదరాబాద్ అమిటీ గ్లోబల్ బిజినెస్ స్కూల్ లో చదివిన హన్సిత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకుని వచ్చింది. భవిష్యత్ లో ఆమె శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కు అధిపతిగా వ్యవరిస్తుందని అంటున్నారు.

English summary
Dil Raju's daughter Hanshitha Reddy is all set to tie the knot with Archit Reddy on May 2 at a grand gala wedding to be held at Fernihills Palace, Ooty.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu