»   » ప్రభాస్, దశరధ్ సినిమా ఎందుకు ఆగింది?

ప్రభాస్, దశరధ్ సినిమా ఎందుకు ఆగింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

దశరధ్, ప్రభాస్ కాంబినేషన్లో దిల్ రాజు రూపొందిస్తున్న చిత్రం షూటింగ్ ఐదు రోజులు జరిగి ఆగిపోయిందని సమాచారం. హీరోయిన్ బాగాలేక ఆమెతో తీసిన సీన్స్ అన్నీ తీసేసి వేరే అమ్మాయిని పెట్టి రీషూట్ చేయాలనే ఆగిపోయినట్లు చెప్తున్నారు. అయితే కొందరు మాత్రం ఇది హీరోయిన్ సమస్య కాదని తేల్చేస్తున్నారు. ప్రభాస్, దిల్ రాజు, దశరధ్ ల మధ్య చోటు చేసుకున్న కొన్ని సమస్యలు, స్పర్ధలు లీడ్ చేస్తూండగా స్క్రిప్టు సరిగా రాలేదని ప్రభాస్ అనాసక్తి చూపటం కూడా ఓ కారణం అంటున్నారు. ఇక ప్రభాస్ దృష్టి అంతా తన లేటెస్ట్ చిత్రం డార్లింగ్ పైనే ఉందని, అది గ్యారెంటీగా హిట్ అవుతుందని చెప్తున్నారు. ఇక దశరధ్..తన వరస ఫెయిల్యూర్ సుస్వాగతం అనంతరం చాలా గ్యాప్ తో ఈ చిత్రం చేస్తున్నారు. దాదాపు సంవత్సరం పైగా ఈ స్క్రిప్టు చేస్తున్నారు. దిల్ రాజు మాత్రం ఆకాశమంతా, జోష్, మరో చరిత్ర ఫెయిల్యూర్ లతో అతి జాగ్రత్తతో వ్యవహిస్తున్నాడని, అది కొంత ఇబ్బంది పెడుతోందని అంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu