Just In
- 4 hrs ago
ఓ వైపు సాయి పల్లవి, మరోవైపు శేఖర్ కమ్ముల.. ఏదైనా నాగచైతన్యకు లాభమే!
- 4 hrs ago
తెలుగులో భారీగా ఆఫర్లు అందుకుంటున్న వరలక్ష్మి శరత్ కుమార్.. అఖిల్, బన్నీతో కూడా..
- 5 hrs ago
నగ్నంగా సీనియర్ నటి ఫోటోషూట్.. సంచలనం రేపుతున్న కిమ్
- 6 hrs ago
మహానటి దర్శకుడి కోసం మరో కొత్త ప్లాన్ రెడీ చేసుకున్న ప్రభాస్!
Don't Miss!
- News
లాయర్ దంపతుల హత్య: సుందిళ్ల బ్యారేజీలో కత్తులు లభ్యం, భారీ అయస్కాంతాలతో..
- Finance
ఆ ధరతో రూ.10,500 తక్కువ, రూ.46,000 దిగువకు పడిపోయిన బంగారం
- Sports
హార్దిక్ పాండ్యాతో పోటీకి శార్దూల్ ఠాకూర్ సై.. 6 సిక్స్‌లతో వీరవిహారం.. సెంచరీ జస్ట్ మిస్!
- Automobiles
ఫిబ్రవరిలో టీవీఎస్ అమ్మకాల హవా.. మళ్ళీ పెరిగిన అమ్మకాలు
- Lifestyle
బియ్యం పిండిని ఇలా ఉపయోగించడం వల్ల కలిగే అద్భుతాల గురించి మీకు తెలుసా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టాలీవుడ్‌లోకి హీరోగా యశ్వంత్ మాస్టర్: బడా నిర్మాత మాస్టర్ ప్లాన్.. లక్కీ ఛాన్స్ కొట్టేశాడుగా!
తెలుగు బుల్లితెరపై వచ్చే వాటిలో 'ఢీ' డ్యాన్స్ షో ఒకటి. చాలా కాలం క్రితం ప్రారంభమైన ఈ షో.. ఇప్పటికీ ప్రసారం అవుతూనే ఉంది. చాలా కాలంగా తన ముద్రను చూపిస్తూ దక్షిణాదిలోనే నెంబర్ వన్ డ్యాన్స్ రియాలిటీగా వెలుగొందుతోంది. ఈ కారణంగానే ఇప్పటికే ఏకంగా 12 సీజన్లను పూర్తి చేసుకుందీ షో. ఇటీవలే 13వ సీజన్‌ను సైతం ప్రారంభించారు. ఇక, ఈ షో ద్వారా ఎంతో మంది కొరియోగ్రాఫర్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అందులో యశ్వంత్ మాస్టర్ ఒకడు. ఇన్ని రోజులు డ్యాన్సర్‌గా మెప్పించిన అతడు హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఆ వివరాలు మీకోసం!

డ్యాన్సర్ నుంచి మాస్టర్ స్థాయికి ఎదిగాడు
డ్యాన్సర్ అవ్వాలన్న లక్ష్యంతో నాట్యంలో శిక్షణ తీసుకున్నాడు యశ్వంత్. ఈ క్రమంలోనే తెలుగు డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ'లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆరంభంలో పలువురు మాస్టర్ల దగ్గర గ్రూప్ బాయ్‌గా పని చేశాడు. ఆ సమయంలోనే చక్కగా రాణిస్తూ అందరి దృష్టినీ ఆకర్షించాడు. దీంతో ఈ యంగ్ టాలెంటెడ్ డ్యాన్సర్‌కు షో నిర్వహకులు మాస్టర్‌గా ప్రమోషన్ ఇచ్చి ప్రోత్సహించారు.

మూడు సార్లు టైటిల్ కొట్టిన ఏకైక మాస్టర్
‘ఢీ' జూనియర్స్ సీజన్ ప్రసారం అయిన సమయంలో శివమణి ద్వారా ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చిన యశ్వంత్ మాస్టర్.. అప్పుడే మొదటి టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఆ తర్వాత ‘ఢీ జోడీ'లో సంకేత్ అండ్ ప్రియాంకకు కొరియోగ్రఫీ చేసి వాళ్లను గెలిపించాడు. ఇక, ఇటీవల ముగిసిన ‘ఢీ ఛాంపియన్స్' సీజన్‌లో పియూష్‌ను గెలిపించాడు. తద్వారా మూడు టైటిళ్లు కొట్టిన మాస్టర్‌గా నిలిచాడు.

సినిమాల్లోనూ ఎంటర్... సమంత పాటతో
‘ఢీ' షో ద్వారా విశేషమైన గుర్తింపును ఫ్యాన్ ఫాలోయింగ్‌ను అందుకున్నాడు యశ్వంత్. ఈ క్రమంలోనే కొన్ని చిన్న చిన్న సినిమాలకు కొరియోగ్రాఫర్‌గానూ పని చేశాడు. అయితే, అతడికి అంతగా గుర్తింపు రాలేదు. కానీ, సమంత హీరోయిన్‌గా చేసిన ‘యూటర్న్'తో చేసిన థీమ్ సాంగ్‌తో బాగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత ‘చిత్రలహరి', ‘బంగారు బుల్లోడు' సహా పలు చిత్రాలకు పని చేశాడు.

మాస్టర్ నుంచి జడ్జ్‌గా మారిన యశ్వంత్
డ్యాన్సర్‌గా, మాస్టర్‌గా, కొరియోగ్రాఫర్‌గా సత్తా చాటాడు యశ్వంత్. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న ‘డ్యాన్స్+' అనే షోతో జడ్జ్‌గా కొత్త అవతారం ఎత్తాడు. ప్రముఖ డైరెక్టర్ ఓంకార్ నిర్వహిస్తున్న ఈ షో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇందులో యశ్వంత్ భార్య కూడా స్పెషల్ అప్పీరెన్స్ ఇస్తోంది. దీంతో అతడు ప్రతి ఎపిసోడ్‌లోనూ హాట్ టాపిక్ అవుతున్నాడు.

టాలీవుడ్‌లోకి హీరోగా యశ్వంత్ మాస్టర్
ఇన్ని రోజులూ స్క్రీన్ వెనుకాలే ఉండి పని చేసిన యశ్వంత్ మాస్టర్.. త్వరలోనే హీరోగా పరిచయం కాబోతున్నాడని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం.. అతడు తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. ఇందుకు సంబంధించిన చర్చలు కూడా ఇప్పటికే ముగిశాయని, ప్రకటన త్వరలోనే రానుందని తెలిసింది.

బడా నిర్మాత మాస్టర్ ప్లాన్.. లక్కీ ఛాన్స్
ఇక, యశ్వంత్ మాస్టర్‌ను పరిచయం చేయబోయేది టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు అని సమాచారం. ఇప్పటికే ఎంతో మంది కొత్త వాళ్లను పరిచయం చేసిన ఆయన.. ఇప్పుడు ఇతడితో సినిమా చేస్తున్నాడట. మొదటి సినిమానే అయినప్పటికీ యశ్వంత్‌ను గ్రాండ్‌గా లాంఛ్ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఇందుకోసం పేరున్న దర్శకుడినే ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది.