»   » కళ్యాణ్ రామ్ తెలివైన నిర్ణయం తీసుకున్నాడు

కళ్యాణ్ రామ్ తెలివైన నిర్ణయం తీసుకున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కళ్యాణ్ రామ్ కెరీర్ లో సినిమాలు అయితే బోలెడు ఉన్నాయి కానీ హిట్ సినిమాలు మాత్రం చాలా తక్కువే. అప్పుడెప్పుడో అతనొక్కడే చిత్రం సూపర్ హిట్ అయితే ఆ తర్వత చాలా చాలా కాలానికి పటాస్ అంటూ పటాస్ పేలి వెలుగు ఇచ్చింది. దాంతో ఎందుకైనా మంచిదని అదే దర్శకుడుతో మరో చిత్రం చేద్దామని కళ్యాణ్ రామ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

సెకండ్ సినిమా సుప్రీమ్ తో హిట్ కొట్టిన అనీల్ రావిపూడి తన మూడో చిత్రం హీరో రామ్ తో చేస్తున్నరు. ఆ చిత్రం లో రామ్ ని గుడ్డివాడిగా చూపిస్తానని చెప్పి ప్రాజెక్టు ప్రారంభం కాకుండానే క్రేజ్ తెచ్చేసాడు.

Also Read: పూరి కోసం ..కళ్యాణ్ రామ్ కొత్త లుక్, షాక్ అవుతారు చూస్తే

ఇవన్నీ గమనించిన కళ్యాణ్ రామ్ తనతో మరో చిత్రం చేయమని అడగటం వెంటనే ఓ లైన్ చెప్పటం, రామ్ సినిమా పూర్తయ్యాక ఈ ప్రాజెక్టే పట్టాలు ఎక్కిస్తానని చెప్పటం జరిగిందట. అయితే రెండో చిత్రం ఎగ్రిమెంట్ లో భాగంగానే కళ్యాణ్ రామ్ తో మరో చిత్రం అనీల్ రావిపూడి చేస్తున్నాడనే టాక్ కూడా ఉందండోయ్.

 Director Anil Ravipudi for Kalyan Ram

ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తుండగా.. ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మూడు రోజుల పాటు రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం..ఇప్పుడు నానక్ రామ్ గూడలో చిత్రీకరణ జరుపుకోనుంది.

ఈ చిత్రం కోసం ఇక్కడ ఓ ప్రత్యేక సెట్ కూడా వేశారు. ఎన్‌టి‌ఆర్ ఆర్ట్స్ పతాకం పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాజీ మిస్ ఇండియా అదితి ఆర్య హీరోయిన్ గా నటిస్తుండగా.. జగపతి బాబు ఓ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు.

 Director Anil Ravipudi for Kalyan Ram

కళ్యాణ్‌ రామ్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై ఓ చిత్రం రూపొందనుంది. నందమూరి కళ్యాణ్‌ రామ్‌ దీనికి నిర్మాత. 'టెంపర్‌' తర్వాత పూరి జగన్నాథ్‌, 'పటాస్‌' వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత కళ్యాణ్‌ రామ్‌ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి కథ, కూర్పు, మాటలు, దర్శకత్వం పూరిజగన్నాథే.

English summary
Now, Anil Ravipudi and Kalyan Ram may be teaming up once again, according to the grapevine.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu