Don't Miss!
- Sports
INDvsAUS : భారత్తో టెస్టు సిరీస్ ముందు.. బెంగళూరులో ఆస్ట్రేలియా జట్టు ప్రాక్టీస్ సెషన్స్
- News
హైదరాబాద్లో మరో దిగ్గజ సంస్థ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్: 1800 మందికి ఉపాధి
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
హిట్ దెబ్బకు మారిన దర్శకుడి తీరు.. జాతాకం చూడకుండా ఇంచు కూడా కదలడం లేదట.. నిర్మాతకు చుక్కలే!
తెలుగు సినీ పరిశ్రమలో సెంటిమెంట్లు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి. కొందరు సినీ నిర్మాతలు, దర్శకులు, హీరోలు అయితే ఈ విషయం మీద చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. అంతెందుకు తెలుగు సినీ పరిశ్రమలో ఒక సినిమా మొదలు పెట్టాలన్నా మంచి ముహూర్తం చూసి మొదలుపెడతారు. రామ్ గోపాల్ వర్మ లాంటి నాస్తికుడిని అని చెప్పుకునే దర్శకులు సైతం నిర్మాతల ఒత్తిడితో ముహూర్తానికే సినిమాలు ప్రారంభిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఒక దర్శకుడి వాస్తు పిచ్చి నిర్మాతకు పెద్ద తలనొప్పిగా మారినట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. మరి ఎవరా నిర్మాత? ఎవరా దర్శకుడు? అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

దర్శకుడి ప్రవర్తన తీరు
చివరిగా ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు ప్రస్తుతం ఒక కుర్ర హీరోతో సినిమా చేస్తున్నాడు.. చివరిగా ఆయనకు లభించిన హిట్ ఇప్పుడు ఆయనను గాల్లో తేలే విధంగా చేస్తోంది. అంతటి భారీ హిట్ పడడంతో సదరు దర్శకుడి ప్రవర్తన తీరు మారిపోయింది అని తెలుస్తోంది. మొదటి సినిమా విషయంలో జాతకాలు వాస్తు ఏమైనా కలిసి వచ్చాయి ఏమో తెలియదు.

ఏవీ నచ్చడం లేదని
కానీ ప్రస్తుతం సినిమా చేస్తున్న నిర్మాతకు ఇప్పుడు దర్శకుడు చెబుతున్న వాస్తు కబుర్లు పెద్ద తలనొప్పిగా మారాయని తెలుస్తోంది. ఇప్పుడు జరుగుతున్న సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయి. ఎన్ని రోజులు హోటల్ లో కాలం వెళ్లదీస్తామని అని భావించి నిర్మాత ఒక ఆఫీస్ సెటప్ చేద్దామని భావించాడట. అందులో భాగంగానే దర్శకుడికి దాదాపు 50 ఆఫీసులు చూపించినా ఏవీ నచ్చడం లేదని తెలుస్తోంది.

డబ్బు ఖర్చు అవుతుందని
వాస్తు పేరు చెప్పి ఆ యాభై ఆఫీసులు కూడా తనకు నచ్చలేదని పక్కన పెట్టాడు దర్శకుడు. ఈ దెబ్బతో షాక్ తిన్న నిర్మాత ఇప్పుడు ఏం చేయాలో తెలియక తల పట్టుకుని కూర్చున్నాడు అని తెలుస్తోంది. ప్రస్తుతానికి హోటల్ రూములు, టెంపరరీ గెస్ట్ హౌస్ లకు ఖర్చు పెట్టడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుందని దానికంటే ఒక ఆఫీసు సెట్ చేసుకుంటే అన్ని విధాలుగా ఇబ్బంది లేకుండా ఉంటుందని సదరు నిర్మాత భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రాజెక్టు నుంచి బయటకు
కేవలం ఈ ఆఫీస్ సెటప్ విషయంలోనే కాదు దాదాపు తన డైలీ పనిలో కూడా సదరు దర్శకుడు జాతకాల మీద వాస్తు మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాడు అని జాతకం చూడకుండా ఇంచు కూడా కలవడం లేదని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సదరు దర్శకుడు పెద్ద దర్శకుడు కాకపోతే నిర్మాత ఈ పాటికే దండం పెట్టి ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చే వాడని అంటున్నారు.
Recommended Video


ఏం చేయాలో అర్థం కాక
కానీ పెద్ద దర్శకుడు కావడంతో ఏం చేయాలో అర్థం కాక దర్శకుడు చెప్పినట్లు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెబుతున్నారు. మరి ఈ వాస్తు, జాతకాల దర్శకుడు ఎవరు అనే దాని మీద పూర్తిగా క్లారిటీ లేదు కానీ నిర్మాత విషయంలో మాత్రం ఇలా చేయడం కరెక్ట్ కాదు అనే చెప్పాలి. ఈ సమస్యకు పరిష్కారం ఎప్పటికి దొరుకుతుందో చూడాలి మరి.