»   » మహేశ్ సినిమా కథకు కోటి రూపాయలా? ఫ్లాప్ డైరెక్టర్ స్టోరీ చెల్లించిన కొరటాల శివ!

మహేశ్ సినిమా కథకు కోటి రూపాయలా? ఫ్లాప్ డైరెక్టర్ స్టోరీ చెల్లించిన కొరటాల శివ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

జనతా గ్యారేజ్ సూపర్‌హిట్ తర్వాత ప్రిన్స్ మహేశ్‌బాబుతో మళ్లీ మ్యాజిక్ చేసేందుకు దర్శకుడు కొరటాల శివ సిద్ధమవుతున్నాడు. ఈసారి తాను తీసిన గత చిత్రాలకు మంచి హిట్ సాధించేందుకు కొరటాల పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాడు. భరత్ అనే నేను అనే టైటిల్‌గా ప్రచారమవుతున్న మహేశ్ చిత్రంపై ప్రస్తుతం కొరటాల దృష్టిపెట్టాడు. గతంలో మహేశ్, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన శ్రీమంతుడు చిత్రం భారీ కలెక్షన్లను సాధించిన సంగతి తెలిసిందే.

కథ కోసం కోటి రూపాయలు

కథ కోసం కోటి రూపాయలు

మహేశ్‌తో నిర్మించే తదుపరి చిత్రానికి సంబంధించిన కథపై కొరటాల శివ భారీ కసరత్తు చేస్తున్నారనే వార్త వినిపిస్తున్నది. ఈ సినిమా కథ కోసం కథ కోసమే కోటి రూపాయలకు పైగా ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తున్నది. ఓ టాలీవుడ్ దర్శకుడు రూపొందించిన కథ ఎక్సైటింగ్‌గా ఉండటం, కథలో అనేక ట్విస్టులు ఉండి ప్రతీ సన్నివేశం ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటంతో కొరటాల శివ ముందు వెనుకా ఆలోచించకుండా దానిని భారీ మొత్తాన్ని చెల్లించి సొంతం చేసుకొన్నట్టు సమాచారం.

 రచయితగా సూపర్‌హిట్

రచయితగా సూపర్‌హిట్

గతంలో రచయితగా కథలు అందించిన సినిమాలు భారీ విజయాలను సాధించాయి. సింహ చిత్ర కథ తనదేనని, అ సినిమా కథా రచయితగా తనకు శ్రీను క్రెడిట్ ఇవ్వలేదని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు బోయపాటిపై కొరటాల ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. రచయితగా గర్ల్‌ఫ్రెండ్, భద్ర, మున్నా, ఒక్కడున్నాడు, సింహా, బృందావన, ఊసరవెల్లి చిత్రాలకు కథను, కథా సహకారాన్ని అందించారు.

 ఫ్లాప్ డైరెక్టర్ కథను..

ఫ్లాప్ డైరెక్టర్ కథను..

ఇప్పటివరకు సొంతంగా కథను రాసుకొన్న కొరటాల శివ మరొకరి కథను ఎంచుకొని సూపర్‌స్టార్ మహేశ్‌తో సినిమా చేయడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అదికాకుండా ఓ ఫ్లాఫ్ డైరెక్టర్ కథను ఎంచుకోవడం మరింత ఆసక్తి రేకిస్తున్నది. ఒక హిట్ సినిమాను అందించని డైరెక్టర్ కథను ఎంచుకొని సాహసానికి పూనుకొన్నారా అనే ప్రశ్న వినిపిస్తున్నది. అంతేకాకుండా టాలీవుడ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కోటి రూపాయలు చెల్లించాల్సిన సత్తా ఆ కథలో ఉందా అనే వాదన లేవనెత్తుతున్నారు.

వివాదాలు లేకుండా..

వివాదాలు లేకుండా..

అయితే శ్రీమంతుడు చిత్ర కథ విషయంలో కొరటాల శివ కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కథ తాను రాసిందనేనని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించడం వివాదాస్పదమైంది. ఈసారి కోర్టు వివాదాలు లేకుండా కొరటాల శివ తగు జాగ్రత్తలు తీసుకొంటున్నారని తెలుస్తున్నది.

English summary
Director Koratala Shiva latest movie with Prince Maheshbabu is Bharat, Anu Nenu. This movie's story provided by a new director cum writer. Reports suggest that Koratala paid Rs.1 Crore for this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu