»   » హాట్ న్యూస్: డైరక్టర్ క్రిష్ మ్యారేజ్ ఫిక్స్, ఎవరితోనంటే... (ఫొటో)

హాట్ న్యూస్: డైరక్టర్ క్రిష్ మ్యారేజ్ ఫిక్స్, ఎవరితోనంటే... (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు క్రిష్ త్వరలో వివాహం చేసుకోబోతున్నారా అంటే అవుననే వినపడుతోంది. ఆయన వివాహం హైదరాబాద్ కు చెందిన ఓ డాక్టర్ తో నిశ్చయమైందని, ఆవిడ పేరు రమ్య అని తెలుస్తోంది. ఇది కుటుంబ సభ్యుల చేస్తున్న ఎరేంజెడ్ మ్యారేజ్ అని విపడుతోంది.

క్రితం సంవత్సవం వరకూ క్రిష్ ..వివాహం చేసుకోవటానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ తల్లి కోరిక మేరకు ఆయన ఓకే చెప్పి, పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. ఆగస్టులో వివాహం జరగబోతోందని తెలుస్తోంది. అయితే ఈ విషయాలపై అఫీషియల్ సమాచారం ఏమీ లేదు.


Director Krish marriage plans

ప్రస్తుతం క్రిష్ ..బాలయ్యతో చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి బిజీలో ఉన్నారు. రీసెంట్ గా విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు ఓ రేంజిలో స్పందన రావటంతో మరింతగా భాధ్యత ఫీలయ్యి...ఇరవై నాలుగు గంటలూ ప్రాజెక్టుని మరింత బాగా తెరకెక్కించాలనే ఆలోచనలోనే ఉన్నట్లు చెప్తున్నారు. రీసెంట్ గా 'గౌతమి పుత్ర శాతకర్ణి' మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు.


దర్శకుడికి ఒక నటుడు ఇంత గౌరవం ఇస్తాడా అని బాలకృష్ణగారిని చూసినప్పుడంతా ఆశ్చర్యపోతుంటా అన్నారు క్రిష్‌. ఆయన దర్శకత్వంలో బాలకృష్ణ హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి'. శ్రియ హీరోయిన్ .


Director Krish marriage plans

క్రిష్‌ మాట్లాడుతూ ''బాలకృష్ణగారు మా సెట్‌లో అందరికంటే చిన్నపిల్లవాడిలా మెలుగుతుంటారు. నిత్య విద్యార్థిలా ఉంటూనే పని విషయంలో మాకు మార్గదర్శిగా నిలుస్తుంటారు. వందో సినిమాల మైలురాయిని చేరుకుంటున్న బాలకృష్ణ సెట్‌లో దర్శకుడికి ఇచ్చే గౌరవం స్ఫూర్తిదాయకం. వ్యక్తిగా ఆయన ఇంకా నచ్చుతారు. ''అని ఆకాంక్షించారు.

English summary
Krish's mother has chosen a pretty bride for her son. Bride's name is Ramya and she is a doctor based in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X